సింధుకు స‌వాల్‌గా మారిన తాయ్ జుయింగ్‌.. ఓడిస్తే గోల్డ్ మెడ‌ల్ గ్యారంటీ..!

జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు గాను భారత ఆటగాళ్లు సాయశక్తుల ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే భారత్‌కు బోలెడు పతకాలు సాధించి పెట్టాలనుకుంటున్నారు.తెలుగు తేజం పీవీ సింధు ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

షెట్లర్‌గా పోటీలో నిలబడి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నది.ఈ రోజు మధ్యాహ్నం సెమీస్‌లో వరల్డ్ నెంబర్ వన్ షెట్లర్ తాయ్‌ జు యింగ్‌తో తలపడనుంది పీవీ సింధు.

ఎవరు గెలుస్తారో చూడాలి మరి. """/"/ అయితే, 2016లో జరిగిన ఒలింపిక్స్ మ్యాచ్‌లో తాయ్ జు యింగ్‌ను గేమ్‌లో ఓడించి భారత్‌కు విజయం సాధించిపెట్టింది సింధు.

కాగా, ఈసారి కూడా అలానే జరగనుందా? అనేది ఆట పూర్తయితేనే తేలుతుంది.ఇక ఇప్పటికైతే గోల్డ్‌ మెడల్‌ ఫేవరెట్‌గా తాయ్‌ జు యింగ్‌ ఉన్నట్లు కనిపిస్తున్నారు.

ఒకవేళ ఆమె ఓటమి పాలైతే సింధుకు గోల్డ్‌ మెడల్‌ గ్యారెంటీగా వస్తుంది.సింధు ఇప్పటికై క్వార్టర్ ఫైనల్‌లో ఐదో ర్యాంకర్‌ జపాన్‌ క్రీడాకారిణి యమగుచిపై వరుస సెట్లలో గెలిచి మరో ఘన విజయాన్ని నమోదు చేసింది.

1 -13, 22-20 తేడాతో భారత్ తరఫున విజయకేతనం ఎగురవేసి సెమీ ఫైనల్‌కు చేరుకుంది.

సొంతగడ్డపైనే యమగూచిపై విజయం సాధించి విన్నింగ్ దశగా అడుగులేసింది సింధు.ఇప్పటి వరకు పీవీ సింధు, తాయ్‌ 18సార్లు తలపడ్డారు.

తాయ్‌ 13 సార్లు సింధుపై విజయం సాధించింది.కానీ, 2016లో జరిగిన ఒలింపిక్స్‌లో మాత్రం పీవీ సింధుయే తాయ్‌పై విజయం సాధించింది.

ఈ ఒలింపిక్స్‌లో కూడా సింధు అదే స్పీడ్‌తో ఆడి భారత్‌కు పతకం తీసుకొస్తుందా? లేదా అనేది చూడాలి.

అయితే, తప్పకుండా సింధు విజయం సాధిస్తుందని భారత క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.మొత్తానికి పీవీ సింధు ఇప్పటి వరకు అయితే జెట్ స్పీడ్‌తోనే వెళ్లిందని, భారత ఆకాంక్షలు నెరవేర్చేందుకు గాను తన వంతు ప్రయత్నం చేస్తున్నదని క్రీడల అభిమానులు చెప్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే5, ఆదివారం 2024