అనంతపురం జిల్లాలో విషాద ఘటన.. ఉరి వేసుకొని సీఐ ఆత్మహత్య

అనంతపురం జిల్లాలో విషాద ఘటన జరిగింది.తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఇంట్లోనే ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు.

అయితే పని ఒత్తిడి కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని సీఐ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, సీఐ ఆనందరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆనందరావు మృతికి సంతాపం తెలిపారు.

ఘటనాస్థలిని అనంతపురం ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు.సీఐ ఆనందరావు మృతికి కారణాలపై ఎస్పీ శ్రీనివాసరావు ఆరా తీశారు.

సీఐ ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి.కుటుంబ కలహాల నేపథ్యంలోనే సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయిన యూకే యువకుడు.. అతని మృతి వెనక ఎన్నో సందేహాలు..