Vundavalli Sridevi : పాపం ఉండవల్లి శ్రీదేవి .. చివరకి అలా ట్వీట్ పెట్టుకోవాల్సి వచ్చింది

'' రాజకీయాలు ఎలా ఉంటాయో.ఎవరు ఎలాంటి వారు ఈ రోజు అర్థమైంది '' అంటూ కొద్ది నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేసి టిడిపిలో చేరిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి( Vundavalli Sridevi ) తన సోషల్ మీడియా ఖాతాలో తాజాగా పోస్ట్ పెట్టారు.

టిడిపి ప్రకటించిన మూడో జాబితాలో ఉండవల్లి శ్రీదేవి పేరు లేకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురై,దానిని ట్వీట్ రూపంలో టీడీపీ పెద్దలకు అర్ధమయ్యేలా చేశారు.

అయితే ఆమె ట్వీట్ లో ఎక్కడా ఏ పార్టీని గాని, వ్యక్తిని గాని ప్రస్తావించకుండా, అందరికీ అర్థమయ్యేలా ఈ పోస్ట్ ను పెట్టారు.

బాపట్ల అనే హ్యాష్ టాగ్ ను పెట్టి కత్తి ఎమోజి పోస్ట్ చేశారు.

ఆమె బాపట్ల పార్లమెంట్ స్థానాన్ని టిడిపి( TDP ) తనకు కేటాయిస్తుందని భావించారు.

అయితే టిడిపి బిజెపి పొత్తులో భాగంగా వరంగల్ నాయకుడికి టికెట్ ను కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన శ్రీదేవి ఈ విధంగా పోస్ట్ చేశారు.

"""/" / వైసీపీలో ఉండగా అక్కడ నాయకులతో సఖ్యత లేకపోవడం, తరచుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారడం, తాడికొండ( Tadikonda )లోని వైసీపీ నాయకులకు ఆమెకు పొసగకపోవడం, అనేక అవినీతి ఆరోపణలు రావడం, తదితర వ్యవహారాలతో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదే లేదని వైసీపీ అధిష్టానం ముందుగానే శ్రీదేవికి తేల్చి చెప్పడంతో, ఆమె టిడిపిలో చేరిపోయారు.

తిరువూరు అసెంబ్లీ( Tiruvuru Assembly Constituency ) టికెట్ ను కానీ, బాపట్ల ఎంపీ స్థానం కానీ తనకు కేటాయిస్తారని ఆమె ఆశలు పెట్టుకున్నారు.

అయితే తిరువూరు సీటును అమరావతి ప్రాంతానికి చెందిన కొలికపూడి శ్రీనివాసరావుకు కేటాయించారు.బాపట్ల స్థానాన్ని తెలంగాణ బిజెపి నేత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు.

దీంతో మనస్థాపానికి గురైన శ్రీదేవి ట్వీట్ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

"""/" / వైసిపిలో టిక్కెట్ వచ్చే అవకాశమే లేదనే ఉద్దేశంతోనే టీడీపీలో చేరినా, ఇక్కడా అదే పరిస్థితి ఎదురవడం, ఇప్పుడు తాను రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉండడంతో, తన అసంతృప్తిని ఈ విధంగా శ్రీదేవి వ్యక్తం చేశారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీదేవికి టికెట్ కేటాయించినా, ఆమె గెలిచే పరిస్థితి లేకపోవడంతోనే చంద్రబాబు ఆమెను పక్కన పెట్టారు.

మనసంతా నువ్వే దర్శకుడిని ఆ సంస్థ నిజంగానే తొక్కేస్తుందా?