కార్పొరేట్ స్కూల్ తరహాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ట్యాబ్ లు.. స్కూల్ లో టీవీలు సీఎం జగన్ సంచలన నిర్ణయాలు..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.రాష్ట్రంలో విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.
చదువు పేదవాడికి భారం కాకుండా ఇప్పటికే అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికభారం తగ్గించిన జగన్ విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు ఇంకా.
టెక్స్ట్ బుక్స్.యూనిఫారం అందిస్తూ రావడం జరిగింది.
అయితే ప్రస్తుతం రోజులు మారటంతో చాలావరకు టెక్నాలజీ రీతిలో చదువులు కొనసాగుతూ ఉండటంతో ఆ దిశగా జగన్ ప్రభుత్వం ముందడుగు వేసింది.
రాష్ట్రంలో విద్యార్థులకు ఉత్తమమైన విద్య అందించడానికి రెడీ అయినట్లు తాజాగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో భేటీ అయిన సమయంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కార్పొరేట్ తరహాలో ఏపీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో "ప్రపంచంతో పోటీపడేలా మన రాష్ట్రంలోని పిల్లలను సన్నద్ధంచేసేందుకు అతిపెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉంది.
2025లో సీబీఎస్‌ఈ పరీక్షలు రాయనున్న 4.7 లక్షల మంది ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకోసం సెప్టెంబరులోనే ట్యాబ్‌లు అందజేస్తాం.
ప్రతి ఏటా ఈ కార్యక్రమం కొనసాగుతుంది."నాడు – నేడు" కింద ప్రతి తరగతి గదిలో టీవీలు ఏర్పాటు చేస్తాం".
అని సోషల్ మీడియా ద్వారా సీఎం జగన్ స్పష్టం చేశారు. .
బీసీ కుల గణన వెనుక అసలు వ్యూహం ఇదా ?