కంగనాపై తాప్సీ వైరల్ కామెంట్స్ ... అసలేమన్నదంటే?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేరు తెలియని సినీ జనాలు ఉండరనేది అతిశయోక్తి కాదు.

సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించి బాలీవుడ్ ప్రముఖులపై ఉవ్వెత్తున ఎగసిపడ్డ విషయం తెలిసిందే.

బాలీవుడ్ లో నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, సుశాంత్ కు అవకాశాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని బాలీవుడ్ ప్రముఖులపై తీవ్రంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

అయితే కంగనా ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు.అయితే అప్పట్లో హృతిక్ రోషన్, దీపికా పదుకొనేపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారానికి తెర లేపిన విషయం తెలిసిందే.

అయితే ఇటీవల తాప్సీ ఇంటిపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.అయితే ఈ దాడులపై తాప్సీపై కంగనా వ్యాఖ్యలు చేసింది.

అయితే సరిగ్గా కంగనా పేరు ప్రస్తావించకుండా ఇంస్టాగ్రామ్ లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కోట్ ను ఉదాహరణను సూచిస్తూ ఓ వార్త పోస్ట్ చేసింది.

మన మీద పడ్డ ప్రతి రాయిని మనం ఒక అవకాశంగా మలుచుకోవాలన్న సచిన్ మాటల్ని ప్రస్తావిస్తూ తన పోస్ట్ లో స్పందించింది.

అయితే తాప్సీ ఇంటిపై జరిగిన ఐటీ దాడులపై అతిగా స్పందించింది కంగనా నే కాబట్టి కంగనాను ఉద్దేశించి మాత్రమే తాప్సీ ఈ పోస్ట్ చేసిందని పలువురు చర్చించుకుంటున్నారు.

ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.కంగనాకు సరైన సమాధానం ఇచ్చావంటూ తాప్సీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే తాప్సీ వ్యాఖ్యలపై కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

గజిని చేయడం నా లైఫ్ లో చెత్త నిర్ణయం.. నయన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!