సినిమాలు ఫ్లాప్ అయితే హీరోయిన్లనే ఎందుకు తప్పు పడతారు… తాప్సీ కామెంట్స్ వైరల్!

తాప్సీ( Taapsee ) టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.కె రాఘవేంద్రరావు మంచు మనోజ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఝుమ్మంది నాదం సినిమా ద్వారా ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

ఇలా మొదటి సినిమాతో పరవాలేదు అనిపించుకున్నటువంటి ఈమె అనంతరం పలు తెలుగు సినిమా అవకాశాలను అందుకున్నారు.

అయితే తాప్సీ నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

దీంతో బాలీవుడ్( Bollywood ) బాట పట్టింది.బాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

"""/" / ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించిన తాప్సీ( Taapsee ) ఏకంగా నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు.

ఇకపోతే ఈమె ఏ విషయం గురించి అయినా ముక్కుసూటిగా సమాధానం చెబుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.

ఇలా పలు విషయాల ద్వారా వివాదాలలో నిలిచినటువంటి తాప్సీ తాజాగా తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో సినిమాలు చేసే సమయంలో వరుసగా ఫ్లాప్స్ తనని వెంటాడాయి అయితే ఆ సమయంలో నాపై చాలామంది ఎన్నో విమర్శలు చేశారు.

"""/" / ఇలా సినిమాలు ఫ్లాప్ అయితే ఆ తప్పు హీరోయిన్ల పైన ఎందుకు వేస్తున్నారని ఈమె ప్రశ్నించారు.

హీరోయిన్లు కొన్ని సన్నివేశాలు పాటలలో మాత్రమే కనిపిస్తారు.అలాంటిది సినిమా ఫ్లాప్ ( Flap Movie )అవ్వడానికి హీరోయిన్లే ఎందుకు కారణమవుతున్నారని తెలిపారు.

నేనేమి సిని బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని కాదు తనకు ఎలాంటి కథలు ఎంపిక చేసుకోవాలో కూడా తెలిసేది కాదు.

తద్వారా ప్లాప్ సినిమాలు ఎదురయ్యాయి.ప్రస్తుతం తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని తెలిపారు.

కెరియర్ మొదట్లో ఇలాంటి విమర్శల కారణంగా చాలా బాధపడ్డారని ప్రస్తుతమైతే ఇలాంటి వాటి గురించి అసలు ఆలోచించడం కూడా లేదు అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కన్నడ బిగ్ బాస్ విన్నర్ కూడా రైతుబిడ్డనే.. ఎంత ఫ్రైజ్ మనీ గెలిచాడంటే?