అలాంటి పెళ్లిళ్లకు మాత్రమే నేను వెళ్తా.. అంబానీ ఇంట పెళ్లిపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు!
TeluguStop.com
తాజాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
ఈ పెళ్లి వేడుక కోసం ముఖేష్ అంబానీ ఏకంగా 5000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరి అట్టహాసంగా పెళ్లి జరిపించారు.
దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పెళ్లి గురించి చర్చించుకునే విధంగా కొడుకు వివాహం జరిపించారు ముఖేష్ అంబానీ.
( Mukesh Ambani ) ఈ వివాహ వేడుకకు దేశ విదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ తదితర రంగాల ప్రముఖులు హాజరు అయ్యారు.
"""/" /
అదేవిధంగా, బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో హీరోయిన్స్ వారి ఫ్యామిలీలో చాలామంది ఈ వేడుకల్లో కనిపించి అలరించారు.
కొందరు సినీ ప్రముఖులు అయితే డ్యాన్స్ కూడా వేసి ఆకట్టుకున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలామంది సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరు కాలేదు.
అటువంటి వారిలో హీరోయిన్ తాప్సీ( Taapsee ) కూడా ఒకరు.అయితే తాజాగా ఆమె పెళ్లికి హాజరు కాకపోవడం విషయంపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది తాప్సీ.
"""/" /
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను అనంత్ అంబానీ వివాహానికి( Anant Ambani Wedding ) హాజరవుతున్నారా అని ఒక విలేకర్ ప్రశ్నించగా.
తాప్సి స్పందిస్తూ.ఆ పెళ్లికి నేను వెళ్లడం లేదు.
నిజం చెప్పాలంటే వాళ్లు నాకు వ్యక్తిగతంగా తెలియదు.పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకున్నది.
ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి, అతిథికి మధ్య కనీసం ఏదో ఒక రకమైన అనుబంధం ఉండాలని నేను భావిస్తాను.
అలాంటి వివాహాలకు మాత్రమే నేను హాజరవుతాను అని తాప్సీ చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా తాప్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
యువతిపై దాడి చేసిన కొండముచ్చు.. భయానక వీడియో వైరల్..