తాప్సీ మరోసారి టాలీవుడ్ ఎంట్రీ.. మాస్ హీరోతో రీ ఎంట్రీకి సిద్ధం!

తాప్సీ పన్ను.ఈమె గురించి తెలియని ప్రేక్షకులు లేరు.

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరికి సుపరిచితమే.ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసి తనకంటూ ఫ్యాన్స్ ను ఏర్పరుచుకుంది.

అయితే వరుస అవకాశాలు వస్తున్న సమయంలో బాలీవుడ్ చెక్కేసింది.అక్కడ ఏ సినిమా వస్తే ఆ సినిమా చేసి అన్ని జానర్స్ ట్రై చేసింది.

మొదట్లో ఈమెకు బాగానే హిట్స్ వచ్చాయి.కానీ ప్లాప్స్ ఎదురయ్యి ఈమె స్పీడ్ కు బ్రేక్ వేసాయి.

పెద్ద హిట్ సినిమాలు ఈమెకు పడలేదు.ఇప్పటికి వరుస సినిమాలు చేస్తుంది కానీ బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం అందుకోలేక పోతుంది.

ఈ ఏడాది లోనే అప్పుడే నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందు వచ్చింది.కానీ ఈ సినిమాలు ఒక్కటి కూడా పెద్ద హిట్ అని చెప్పుకునే స్థాయిలో లేవు.

ప్రెజెంట్ ఈమె మరొక నాలుగు సినిమాల్లో నటిస్తుంది.మరి ఇవైనా అమ్మడికి కలిసి వస్తాయో లేదో చూడాలి.

ఇదిలా ఉండగా ఈమె ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ తెరపై అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతుంది అని తెలుస్తుంది.

"""/"/ ఎన్నో ఏళ్ల తర్వాత టాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

ఇప్పటికే ఈమెకు రెండు అవకాశాలు వచ్చాయట.మరి అందులో మాస్ రాజా రవితేజ సినిమా అని కూడా తెలుస్తుంది.

రవితేజ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.మరి సితార ఎంటర్టైన్మెంట్స్ వారే తాప్సీకి ఒక ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

మరి ఈమె ఈ సినిమా ఆఫర్ ను దాదాపు ఓకే చేసినట్టే టాక్.

అదే నిజమైతే తాప్సీ మరోసారి మాస్ రాజా రవితేజ సినిమాలో నటించే ఉంది.

చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు ప్రకటిస్తారో.

హాలీవుడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. బాక్సాఫీస్ షేక్ కానుందా?