T20 WC 22: అరుదైన ఫీట్ సాధించిన షకీబ్ అల్ హసన్!
TeluguStop.com
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఫుల్ జోష్ లో వున్నాడు.అవును, టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా భారత్ చేతిలో ఓటమి పాలైనా కూడా షకీబ్ అల్ హసన్ ఓ అరుదైన ఫీట్ సాధించాడు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా న్యూజిలాండ్ పేసర్ సౌథీ(127) పేరిట వున్న రికార్డును సమం చేసేసాడు.
మరికొన్ని రోజులలో ఆ రికార్డును చెరిపివేసే దిశగా అడుగులు వేయనున్నాడు.టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన షకీబ్.
ఈ అరుదైన రికార్డును సమం చేసినట్టు తెలుస్తోంది.ఇప్పటి వరకు 101 ఇన్నింగ్స్‌లలో న్యూజిలాండ్ పేసర్ సౌథీ 127 వికెట్లు పడగొట్టగా.
షకీబ్ 106 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించడం విశేషం.ఇక ఆఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 121 వికెట్లతో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక నిన్న జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే.అఖరి వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో బంగ్లాదేశ్‌పై 5 పరుగుల తేడాతో భారత్ విజయం దుందుభి మోగించింది.
దీంతో సెమీస్ అవకాశాలను బంగ్లాదేశ్ కాస్త కష్టంగా మలుచుకుంది. """/"/
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన షకీబ్ అల్ హసన్.
భారత్‌తో ఇలాంటి పరాజయాలకు బంగ్లా అలవాటు పడిపోయిందని అన్నాడు.అయితే ఈ కీలక మ్యాచ్ లో ఓడిపోనప్పటికీ తమదైన అద్భుతమైన ఆటతీరుతో భరత్ జట్టును వణికించామని షకీబ్ అల్ హసన్ అనడం కొసమెరుపు.
ప్రతీసారి విజయం వరిస్తుంది అని అనుకొనేలోపు, చేతులెత్తుస్తున్నామని, గతంలో కూడా ఈ తరహా ఫలితాలు తమకు ఎదురయ్యాయని ఒకింత బాధతో పేర్కొన్నాడు.
ఇంకో మ్యాచ్ ఉందని, ఆ మ్యాచ్‌లో విజయం సాధించి సత్తాచాటుతామని షకీబ్ అల్ హసన్ ధీమా వ్యక్తం చేసాడు.
పుల్లుగా తాగి పోలీస్ స్టేషన్ ముందే మూత్రం పోసిన హెడ్ కానిస్టేబుల్