టీ-ఎంఆర్పీఎస్ మద్దతు కాంగ్రెస్ పార్టీకే: చింత బాబు మాదిగ

నల్లగొండ జిల్లా: దళిత, గిరిజనుల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అందుకే పార్లమెంట్, ఎమ్మెల్సీ,స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీ-ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింత బాబు మాదిగ అన్నారు.

శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ అఫీస్ లో నియోజకవర్గ టీ-ఎంఆర్పీఎస్ ఇంచార్జ్ కంబాలపల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరై మాట్లడుతూ టీ-ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

రాబోయే పార్లమెంట్,ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికల్లో కూడా యావత్ మాదిగ జాతి మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని స్పష్టం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే బాలూ నాయక్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తుందని,400 పైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ఓపెన్ గా ప్రచారం చేస్తుందన్నారు.

ఇప్పటికైనా బహుజన జాతులు ఒక్కటై రాజ్యాంగ రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఎంతగానో కష్టపడి బహుజన జాతి మేలు కోసం డాక్టర్ బి.ఆర్.

అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే,ఈరోజు నీచమైన ఈ బీజేపీ ప్రభుత్వం మారుస్తానని చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘనేనన్నారు.

అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున టీ-ఎంఆర్పీఎస్ మేడి పాపన్న ఆధ్వర్యంలో మద్దతు తెలపడం చాలా సంతోషమని,మాదిగలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని,హరిజన,గిరిజనలను ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు.

ఈ కార్యక్రమంలో టీ-ఎంఆర్పీఎస్ ప్రచార కార్యదర్శి జానయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పల్లేటి లక్ష్మయ్య,సీనియర్ నాయకులు ఎర్ర యాదగిరి, నరసింహ,ఎర్ర వెంకటేశ్వర్లు, శ్రీనివాస్,ఆరెకండి యేసయ్య, మాతంగి హరికృష్ణ,ఆడెపు సతీష్ మాదిగ,ఎర్ర ఆంజనేయులు,మద్దిమడుగు సాయి,దున్న ముత్యాలు, నాగరాజు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ వెయిట్ లాస్ జర్నీలో ఈ మ్యాజికల్ డ్రింక్ ను యాడ్ చేసుకుంటే మరింత వేగంగా బరువు తగ్గొచ్చు.. తెలుసా?