టి. కాంగ్రెస్ లో వారసుల సందడి ఎక్కువగా ఉందే ? ఎంపీ స్థానాలపై కన్ను
TeluguStop.com
మరికొద్ది నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ గెలవాలనే లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ఉంది .
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వెలువడడం , అధికారంలోకి రావడంతో పార్లమెంట్ ఎన్నికల్లోను తమకు తిరుగుండదని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటుంది.
దీంతో ఎంపీ స్థానాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది పార్టీ సీనియర్ నాయకులు అంతా టిక్కెట్ల కోసం పోటీ పడుతుండగా, ఇప్పుడు నాయకుల వారసులు కూడా టికెట్లు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి( Senior Leader Jana Reddy ) ఇప్పటికే టికెట్ ప్రకటించుకున్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి తాను లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించారు.
తాను పోటీకి దిగకపోతే తన కుమారుడు రఘువీర్ రెడ్డితో ( Raghuveer Reddy )పోటీ చేయించే ఆలోచనలు ఆయన ఉన్నారు.
రఘువీర్ 2018 లోనే మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి , నల్గొండ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ప్రయత్నించినా, అప్పట్లో అవకాశం దక్కలేదు.
అయితే ఈసారి పోటీకి దింపాలని జానారెడ్డి ప్రయత్నిస్తున్నారు కోమటి రెడ్డి కుటుంబ సభ్యులలోనూ ఒకరిని పోటీకి దింపాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
"""/" /
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని( Komatireddy Lakshmini ) పోటీ చేయాలని నిర్ణయించుకుని టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు .
ఒకవేళ ఆ అవకాశం దక్కకపోతే ఆయన సోదరుడైన కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు డాక్టర్ సూర్య పవన్ రెడ్డిని పోటీకి దించుతారనే ప్రచారం జరుగుతుంది.
ఇక బీఆర్ఎస్ నుంచి వారసుల సందడి ఎక్కువగానే ఉంది.శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వచ్చే లోకసభ ఎన్నికల్లో తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి నల్గొండ లేదా భువనగిరిలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు .
తాను ఎంపీగా పనిచేసినప్పుడు ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలు తన పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు.
"""/" /
అమిత్ రెడ్డి పోటీ విషయం పార్టీ నేతలతో చర్చించనున్నారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రంలోని 14 లోక్ సభ స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కూడా వ్యూహాత్మకంగానే నిర్ణయాలు తీసుకుంటుంది.కచ్చితంగా అన్ని స్థానాల్లోనూ గెలవాలనే లక్ష్యాన్ని బిజెపి విధించుకుంది .
ఈ మేరకు టికెట్లు కేటాయింపు విషయం పైన కసరత్తు మొదలుపెట్టింది.బిజెపి నుంచి ఎంపీ టికెట్లు ఆశిస్తున్న వారు ఎక్కువగానే ఉన్నారు.
అయితే కాంగ్రెస్ లోనే వారసుల హడావుడి ఎక్కువగా ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ వారసులకు టికెట్ ఇప్పించుకోవాలనే గట్టి ప్రయత్నాలు చేసినా అవకాశం దక్కకపోవడంతో ఈసారి ఎలాగైనా ఎంపీ సీటు ఇప్పించుకునేందుకు కాంగ్రెస్ హై కమాండ్ వద్ద టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్ నేతలు.
రజనీకాంత్ పాటకి అదిరిపోయే డ్యాన్స్ చేసిన చిలుక.. వీడియో వైరల్..