టి. కాంగ్రెస్ భవిష్యత్ తేల్చనున్న కర్ణాటక ఫలితం ?
TeluguStop.com
కర్ణాటకలో( Karnataka ) ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల( Assembly Elections ) ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అక్కడ ఎన్నికలు ఫలితం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటే ఆ ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ పై ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అందుకే ఇప్పుడు అక్కడ ఎన్నికల ఫలితం పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది అని ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉండడంతో కర్ణాటకలో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం కనిపిస్తుంది.
అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అక్కడ ఫలితం పై ఆశలు పెట్టుకున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది.ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే తెలంగాణలో కాంగ్రెస్ కు కొత్త బలం రావడంతో పాటు, నాయకులలోను ఉత్సాహం పెరుగుతుంది.
"""/" /
అలాగే గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టి పార్టీ నేతలంతా సమిష్టిగా కాంగ్రెస్( Congress ) విజయం కోసం కృషి చేసే అవకాశం ఉంది .
ఇక జనాల్లోనూ కాంగ్రెస్ పై సానుకూలత ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితం పై ఇంతగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు టెన్షన్ పడుతున్నారు.
తెలంగాణలో బీ ఆర్ ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రకటనలు చేస్తున్న , తెలంగాణలో క్రమ క్రమంగా బిజెపి బలం పెంచుకోవడం ఆ పార్టీకి టెన్షన్ కలిగిస్తుంది .
బీఆర్ఎస్( BRS ) తో పాటు కాంగ్రెస్ నుంచి వలసలు చోటు చేసుకోవడం, అలాగే కర్ణాటక ఎన్నికల తరువాత బిజెపి( BJP ) అగ్ర నాయకులంతా తెలంగాణ పైనే దృష్టి పెట్టబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ టెన్షన్ పడుతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తేనే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
"""/" /
వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ తెలంగాణలో పరాజయం పొందడం, కేంద్రం ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ కు ఇచ్చినా, ఇక్కడ గెలవలేకపోవడం ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరాజయం ఎదురైతే ఇక పూర్తిగా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోతుందనే భయం వారిలో పెరిగిపోతుంది.
అందుకే కర్ణాటక ఫలితం పై అక్కడి కాంగ్రెస్ నాయకుల కంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎక్కువగా టెన్షన్ పడుతూ ఫలితాల కోసం అంత ఆసక్తిగా ఎదురుచూపులు చూస్తున్నారు.
మాంసాహారంపై నిమ్మరసం పిండి తీసుకోవచ్చా?