ముక్కలన్నీ కలుపుతున్న కాంగ్రెస్??

తెలంగాణలో రోజురోజుకు కాంగ్రెస్ బలపడుతుంది.2024 అసెంబ్లీ ఎన్నికలలో తన సత్తా చాటాలని ఉవ్విలూరుతుంది .

తెలంగాణను దశాబ్దాలు పాటు పరిపాలించిన కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమం తర్వాత తన ప్రాబల్యాన్ని కోల్పోయింది.

తెలంగాణ తెచ్చిన ఇమేజ్ ను సొంతం చేసుకున్న కెసిఆర్ ప్రజల అభిమానాన్ని గెలుచుకుని ప్రబుత్వం ఏర్పాటు చేశారు .

ఆ తర్వాత బలమైన కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడంలో కేసీఆర్ తెరవనక చక్రం తిప్పి కీలక నేతలందరినీ తన పార్టీలోకి చేర్చుకోవడంలో విజయం సాధించారు.

నేతలను చేర్చుకోగలిగినప్పటికీ వారికి పదవులు ఇచ్చి పూర్తి స్థాయిలో సంతృప్తి పరచడంలో మాత్రం కేసిఆర్ సక్సెస్ అవ్వలేకపోయారు .

"""/" / అయినప్పటికీ తెలంగాణాను ఏకచత్రాధిపత్యంతో ఎలుతున్న కేసిఆర్( CM KCR ) కు వ్యతిరేకంగా నిలబడే ధైర్యం ఏ నాయకుడు చేయలేకపోయారు.

దాంతో సరైన వేదిక కోసం ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు కొత్త సంజీవని లా మారాయి.

పార్టీ హై కమాండ్ కూడా తెలంగాణలో అధికారులకు రావాలని బలంగా కోరుకుంటున్నందున ఇప్పుడు కీలక నాయకులను తిరిగి పార్టీలోకి ఆకర్షించగలుగుతుంది.

రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నాయకత్వంలో పార్టీలోకి కేసీఆర్ వ్యతిరేకులు అందరినీ పునరేకీకరణ చేస్తుంది.

వ్యక్తిగతంగా బలమైన ఇమేజ్ కలిగిన నేతలు ఉన్నప్పటికీ సమిష్టిగా పనిచేయడంలో విఫలమవుతుండటం కాంగ్రెస్కు ఉన్న అతిపెద్ద బలహీనత.

"""/" / అయితే ఈసారి కలిసికట్టుగా పనిచేయాలని వ్యక్తిగత ఇగోలు పక్కన పెట్టాలని బలంగా కోరుకోవడంతో విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయడానికి నేతలు ముందుకు వస్తున్నారట ముఖ్యంగా సీతక్క, జూపల్లి, వెంకటరెడ్డి లాంటి కీలక నేతలు తమ మద్య విభేదాలను పక్కనపెట్టి పనిచేస్తామని ప్రకటించడం గమనార్హం .

ఆరు నెలలపాటు రాజకీయ కార్యాచరణక పై ఆలోచించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivasa Reddy )లాంటి నేతలు కూడా అధికారులకు రావడానికి కాంగ్రెస్సే సరైన మార్గమని భావించి కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా ప్రకటించారు.

దాంతో కేసిఆర్ కు దీటైన ప్రత్యామ్నాయం ఏర్పడుతున్నట్లుగా కనిపిస్తుంది। తెలంగాణ రాజకీయాల్లో కీలక ప్రభావం చూపగలిగిన నేతలందరినీ తిరిగి ఒక జట్టుగా మలచడం లో రేవంత్ రెడ్డి వర్గం చేస్తున్న కృషి ఫలిస్తున్నట్లే కనిపిస్తుంది.

మరి ఈ సమిష్టితత్వం కాంగ్రెస్కు అధికారం అందిస్తుందో లేదో చూడాలి .

వీడియో వైరల్: క్షణాలలో 8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకి?