దయాకరన్నపై దయ చూపని టీ కాంగ్రెస్.. శ్యామ్యూల్ విజయం సాధిస్తారా..?

తెలంగాణ కాంగ్రెస్ ఈసారి బలమైన శక్తిగా ఎన్నికల బరిలోకి దిగుతోంది.ఓవైపు టికెట్లు కేటాయిస్తూ మరోవైపు అసంతృప్తులను బుజ్జగిస్తూ ఎక్కడికక్కడ ఓట్లు చీలిపోకుండా గట్టి ప్లాన్ తో కేసీఆర్ (KCR) కు కొరకని కొయ్యగా మారిందని చెప్పవచ్చు.

అలాంటి కాంగ్రెస్ లో ఈసారి టికెట్ల విషయంలో చాలామంది సీనియర్ నేతలు భంగపడ్డారు.

అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అద్దంకి దయాకర్ ( Addanki Dayakar ) .

కాంగ్రెస్ లో ఎంతో పేరు ఉన్న లీడర్.మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి నాయకుడు.

అలాంటి దయాకర్ కు తుంగతుర్తి నియోజకవర్గంలో టికెట్ రాలేదు.దీంతో ఆయన రియాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

"""/" / తుంగతుర్తి నియోజకవర్గంలో దయాకర్ కు టికెట్ ఇవ్వకుండా అధిష్టానం మందుల శ్యామ్యులు ( Shamuel ) కు టికెట్ కేటాయించింది.

ఇదే తరుణంలో అద్దంకి దయాకర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.

కాంగ్రెస్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది.

కాబట్టి నా మద్దతు దారులు కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవద్దు.ఎవరికి కూడా వ్యతిరేకంగా మాట్లాడవద్దని అన్నారు.

మరి ఈ విషయాన్ని బట్టి చూస్తే మాత్రం అధిష్టానం చెప్పిన నిర్ణయానికి దయాకర్ అన్న కట్టుబడి ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.

"""/" / మరి కింది స్థాయి వర్గం మాత్రం చాలా అసంతృప్తితో ఉందట.

సీనియర్ నేత ఆయన దయాకర్ అన్నకు టికెట్ ఇవ్వకుండా శామ్యూల్ కి ఎలా ఇస్తారని లోలోపల చర్చించుకుంటున్నారట.

ఇదే క్రమంలో వారు శామ్యూల్ సపోర్ట్ చేస్తారా లేదా అనేది చాలా ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ సపోర్ట్ చేయకుంటే మాత్రం అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ ( Gadari Kishore ) తప్పక విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరి చూడాలి డిసెంబర్ 3న తుంగతుర్తి భవితవ్యం బయటపడనుంది.

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గౌరవం