గుండె జబ్బును ముందుగా గుర్తించగలిగే ముఖ్యమైన లక్షణాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని( World Health Day ) ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

ఈ ప్రత్యేక రోజున పలు రకాల ఆరోగ్య సమస్యలు వాటి నివారణల పై ప్రజలకు అవగాహన కలిగిస్తారు.

ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గుండె సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కలిగించేందుకు నిపుణులు అవగాహన కలిగించారు.

ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు( Heart Diseases ) ఎందుకు పెరుగుతున్నాయి.వాటి ప్రారంభ లక్షణాలు ఏమిటి? వాటిని ఎలా నివారించవచ్చు అన్న సమాధానాలు నిపుణులు వెల్లడించారు.

గతి తప్పిన ఆహారాలు వాటిలో అస్తవ్యస్తమైన జీవన శైలి వల్ల గుండె జబ్బులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

"""/" / చాలామంది ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేరు.దీనికి గల కారణమేమిటంటే వ్యక్తులకు ఈ లక్షణాల గురించి సరైన అవగాహన ఉండదు.

తీవ్రమైన చాతినొప్పి ( Chest Pain ) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,గుండె వేగంగా కొట్టుకోవడం లేదా తగ్గడం, మూర్ఛ, వికారం, వాంతులు ఎల్లప్పుడూ బలహీనంగా అనిపించడం, జ్వరం, అలసట, కడుపునొప్పి వంటి ఏవైనా సమస్య ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకూడదు.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.అలాగే ప్రతిరోజు కొంత శరీరక శ్రమ చేయడం ద్వారా గుండె పోటు ను నివారించవచ్చు.

"""/" / అందుకే వ్యాయామం లేదా యోగా చేయాలి.రోజువారి జీవితంలో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలి.

సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.అన్నిటికంటే ముఖ్యంగా సరైన ఆహార నియమాలను పాటించడం ఎంతో అవసరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మీకు ఎక్కువ జంక్ ఫుడ్( Junk Food ) తినే అలవాటు ఉంటే వెంటనే దూరం చేసుకోవాలి.

ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

గత కొన్ని సంవత్సరాలుగా ఫాస్ట్ ఫుడ్ తినే వారి సంఖ్య పెరుగుతూ ఉంది.

ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే సకాలంలో పరీక్షలు చేయించుకుని వైద్యులను సంప్రదించాలి.

గుండె జబ్బులకు సంబంధించిన ఏమైనా లక్షణాలు కనిపిస్తే లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి.

ఆ ఒక్క నమ్మకంతోనే ఉన్నాము.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన అలేఖ్య రెడ్డి?