హార్ట్ ఎటాక్ ముందు ఇలాంటి లక్షణాలే ఉంటాయట.?
TeluguStop.com

నేటి జనరేషన్ ఆరోగ్యం పైన అసలు దృష్టి పెట్టడం లేదు.ఉరుకుల పరుగుల జీవితంలో అసలు ఆరోగ్యం గురించి ఆలోచించే సమయం కూడా ఉండడం లేదు.


చాలామంది ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా హార్ట్ ఎటాక్ లాంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


అయితే గుండెకు రక్తసరఫరా సరిగ్గా ఉన్నంత సేపు ఏమీ అవ్వదు.అదే రక్త సరఫరలో ఏదైనా తేడా వచ్చిందంటే గుండెపోటుకు దారి తీస్తుంది.
గుండెపోటు వచ్చే ముందు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తోంది.అవేంటంటే.
గుండెపోటు వచ్చే కొద్ది సమయం ముందు శ్వాస తీసుకోవడం ఎంతో ఇబ్బందిగా మారుతుంది.
అంతే కాకుండా మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురిఅవ్వటం.ఒకే విషయాన్ని ఎక్కువ సార్లు చెప్పటం లాంటి లక్షణాలు కూడా గుండెపోటు వచ్చే ముందు కనిపిస్తూ ఉంటాయి.
గుండెకు రక్త సరఫరా తగ్గినట్లయితే గుండెల్లో ఒక్కసారిగా మంటలు పుట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
గుండె భారంగా కూడా అనిపిస్తూ ఉంటుంది.శరీరం పైభాగం నుంచి ఎడమ చేయి కింది భాగం వరకు ఒకవేళ నొప్పిగా అనిపిస్తే.
గుండెపోటు రాబోతుంది అనటానికి సంకేతం .ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఎంతో మేలు.
లేకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.
ఆ యాప్స్ ప్రమోట్ చేయాలని 3 కోట్ల ఆఫర్.. శివబాలాజీ సంచలన వ్యాఖ్యలు వైరల్!