కుమార్ సాయికి అదే బలమయ్యిందా?

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

ఈ షో తొలి మూడు సీజన్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఇప్పుడు 4వ సీజన్‌ను మంచి అంచనాల నడుమ టెలికాస్ట్ చేస్తున్నారు.

కాగా ఈ షో మొదలై ఇప్పటికే 26 రోజులు పూర్తికాగా రోజురోజుకూ ఈ షో ఆసక్తికరంగా మారుతూ వస్తోంది.

అయితే ఈ షోలో ఒక్కో పోటీదారుడు ఒక్కో విధంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.

ఈ షోకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన తెలుగు కమెడియన్ కుమార్ సాయి బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత షోలో చిన్నపాటి అలజడి మొదలైందని చెప్పాలి.

అయితే మధ్యలో వచ్చిన కుమార్ సాయిని హౌస్‌మేట్స్ అందరూ టార్గెట్ చేసినట్లు కనిపించడంతో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

కాగా కుమార్ సాయిని కార్నర్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో సానుభూతి ఏర్పడి మంచి మార్కులు పడుతున్నాయి.

ఈ క్రమంలోనే ఆయన బిగ్ బాస్ హౌజ్‌కు ఈ వారం కెప్టెన్‌గా మారాడు.

దీంతో కుమార్ సాయి ఈ వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడు.అయితే ఈ సానుభూతి అనే అంశం కుమార్ సాయికి ఎంతవరకు కలిసొస్తుందో అనేది చూడాలి.

సమయం గడుస్తున్నకొద్ది బిగ్‌బాస్ హౌజ్‌లో చోటు చేసుకుంటున్న మార్పులు కుమార్ సాయిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

ఏదేమైనా ఈ వారం కుమార్ సాయి సేఫ్ గేమ్ ఆడి ఇంటి కెప్టెన్‌గా మారాడనేది వాస్తవం.

మరి కుమార్ సాయి ఈ ఇంటిలో ఎంతవరకు కొనసాగుతాడో చూడాలి అంటున్నారు ఆయన్ను అభిమానించేవారు.

ఇక ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

స్విమ్ సూట్ లో సూపర్ స్టార్ మహేశ్ భార్య నమ్రత.. ఈ ఫోటోలను చూస్తే షాకవ్వాల్సిందే!