విద్యుత్ సంక్షోభం ఎదుర్కోవటానికి స్విట్జర్లాండ్ సంచలన నిర్ణయాలు..!!
TeluguStop.com
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో విద్యుత్ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.పెరిగిన విద్యుత్ డిమాండ్ తట్టుకోవడానికి అనేక దేశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఈ క్రమంలో ఇటీవలే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ (CEA) ఘన్ శ్యాం ప్రసాద్ .
విద్యుత్ సరఫరా డిమాండ్ పెరిగిందని తెలిపారు.దీంతో వచ్చే ఏడాది దేశంలో కరెంటు సంక్షోభం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
ఇప్పుడు ఇదే రీతిలో స్విట్జర్లాండ్ దేశం కూడా విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటుంది.ఇటువంటి నేపథ్యంలో కరెంటు వినియోగాన్ని తగ్గించేందుకు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను నిషేధించే ఆలోచనలో అక్కడి ప్రభుత్వం రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కాదు థియేటర్ లు ఇంకా క్రీడా కార్యక్రమాలను సైతం నిషేధించడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒక స్విట్జర్లాండ్ మాత్రమే కాదు యూరప్ దేశాలు సైతం.ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి .
పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
1940ల నాటి చిరిగిన స్వెట్‌షర్ట్ అమ్మకానికి.. ధర వింటే కళ్లు తేలేస్తారు!