ఈత సరదా కుటుంబాల్లో విషాదంగా మారకూడదు:ఎస్పీ

సూర్యాపేట జిల్లా:వేసవి కాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతోమంది పిల్లలు యువకులు సరదా కోసం ఈత నేర్చుకోవడానికి చెరువులు,కాలువలకు వెళుతుంటారని,ఈత సరదా కుటుంబాల్లో విషాదంగా మారకూడదని జిల్లా ఎస్పీ కె.

నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.వేసవి సెలవుల్లో పిల్లలు ఈతకు వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని,ఈతను నేర్చుకునేవారు తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవడం ఉత్తమమని తెలిపారు.

ముఖ్యముగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు, కాలువలు,కుంటలు,క్వారీల గుంతల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఏదైనా అనుకోని సంఘటన జరిగినట్లయితే పిల్లల ప్రాణానికి ప్రమాదమని,ఈత విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలను యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు.