స్విగ్గీలో నూడుల్స్‌ ఆర్డర్‌ ఇస్తే రక్తం... తింటే ప్రాణాలకే ప్రమాదం

మారుతున్న జీవన శైలి కారణంగా మనిషి తినడానికి కూడా టైం కేటాయించలేక పోతున్నాడు.

ఇలాంటి సమయంలో వండటంకు అసలు సమయం ఉంటుందా, మొత్తం కూడా ఆన్‌లైన్‌ అయిన ఈ సమయంలో తిండి కూడా ఆన్‌లైన్‌ అయ్యింది.

పలు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలవరీ సంస్థలు పుట్టుకు వచ్చాయి.ఈ ఫుడ్‌ డెలవరీ సంస్థలు సరైన ప్రమాణాలు పాటించని కారణంగా వినియోగదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఆమద్య ఒక వ్యక్తి పార్శిల్‌ను విపి, కొంత తిని, ఆ తర్వాత మళ్లీ పార్శిల్‌ను చేయడం, దాన్ని డెలవరీ చేయడం జరిగింది.

ఆ సంఘటన ఆన్‌ లైన్‌ ఫుడ్‌ డెలవరీ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంతా భావించారు.

కాని ఆన్‌లైన్‌లో ఫుడ్‌ను ఆర్డర్‌ చేసే వారి సంఖ్య మరింతగా పెరుగుతూనే ఉంది.

తాజాగా మరో సంఘటన జరిగింది.తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని సెలయూర్‌ ప్రాంతంలో ఉండే బాలమురుగన్‌ అనే వ్యక్తి నూడుల్స్‌ను ఆర్డర్‌ ఇచ్చాడు.

ఎంతో ఆకలి మీదున్న బాలమురుగన్‌ వచ్చిన పార్శల్‌ను హడావుడిగా విప్పి తినడం మొదలు పెట్టాడు.

సగం తిన్న తర్వాత అతడికి నూడుల్స్‌లో రక్తం అంటి ఉండ బ్యాండేజ్‌ కనిపించింది.

దాంతో అవాక్కయిన అతడు తీవ్ర ఆగ్రహంతో సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్‌ చేశాడు.

స్విగ్గీ లో తాను నూడుల్స్‌ ఆర్డర్‌ ఇస్తే ఇలాంటి అనుభవం ఎదురైంది అంటూ సుదీర్ఘమైన పోస్ట్‌లో అతడు పేర్కొన్నాడు.

వంట మాస్టర్‌ చేతికి లేదా మరెక్కడైనా గాయం అయితే దాన్ని వేసుకుని ఉంటాడు, అది కాస్త జారి నూడుల్స్‌ లో పడింది, ఇదేనా మీరు పాటించే ప్రమాణాలు అంటూ బాలమురుగన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ బోజనం తిన్న తన పరిస్థితి ఏంటీ, ఆ రక్తం వల్ల తాను అనారోగ్యం పాలయితే పరిస్థితి ఏంటీ, ఆ వ్యక్తికి మరేవైనా జబ్బులు ఉంటే బాలమురుగన్‌ పరిస్థితి ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

ప్రణాలు సైతం పోయే అవకాశం ఉందని, ఇలాంటి సెఫ్టీ లేని వారి వద్ద ఫుడ్‌ తీసుకుని జనాలకు ఇస్తుండటంతో ప్రాణాలు సైతం పోయే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

ఈ విషయమై స్విగ్గీ స్పందించింది.కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, మీ ఆర్డర్‌ నెంబర్‌ చెబితే మళ్లీ మీకు కొత్త పార్శిల్‌ పంపుతామంటూ చెప్పుకొచ్చింది.

స్విగ్గీ వివరణ సిల్లీగా ఉంది.రక్తం కూడును పంపించిన హోటల్‌తో తెగతెంపులు చేసుకోకుండా, మళ్లీ అక్కడ నుండే ఆహారం అందిస్తామని చెప్పడం సిగ్గు చేటు అంటూ సోషల్‌ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.