స్వీప్ అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఓటు హక్కు ఉన్న వారందరూ రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) తమ ఓటు వేయాలని స్వీప్ ఆద్వర్యంలో అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు ‌.

(స్వీప్ సిస్టంటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రా్రాల్ పార్టిసిపేషన్ ) ఆద్వర్యంలో  కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) కేంద్రంలోని జిల్లా సమాఖ్య భవనంలో 'ఐ ఓటు ఫర్ ష్యూర్' ఓటు హక్కు నా బాధ్యత' పై సమాఖ్య ఆఫీసు బాధ్యులు, వీఓ ప్రెసిడెంట్లు, వీఓఏలకు అవగాహన కల్పించారు.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో అర్హులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

 అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, అడిషనల్ డీఆర్డీఓ గొట్టే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వావ్, పక్షిని అద్భుతంగా క్యాచ్ పట్టిన టైగర్‌ఫిష్.. వీడియో వైరల్‌..