Nikhil : పుట్టబోయే బిడ్డ కోసం ఆ పని ఇప్పుడే నేర్చుకుంటున్న నిఖిల్.. తండ్రిగా గ్రేట్ అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో నిఖిల్ ( Nikhil )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

హీరో నిఖిల్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు.వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు నిఖిల్.

ఒకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతూనే మరొకవైపు పర్సనల్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

కాగా హీరో నిఖిల్ త్వరలోనే తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే.నిఖిల్ 2020లో పల్లవి( Pallavi ) అనే డాక్టర్ ని పెళ్లి చేసుకున్నారు.

దాదాపు మూడేళ్ళ తరువాత ఈ కపుల్ తమ మొదటి బేబీకి వెల్కమ్ పలుకుతున్నారు.

ఇటీవలే పల్లవి సీమంతం కూడా ఘనంగా జరిగింది. """/" / అందుకు సంబంధించిన ఫోటోని నిఖిల్ షేర్ చేస్తూ.

సీమంతం అనేది ఇండియన్ ఫార్మ్ ఆఫ్ బేబీ షవర్.త్వరలో మా ఫస్ట్ బేబీ రానుంది అని చెప్పడానికి పల్లవి, నేను చాలా హ్యాపీగా ఉన్నాము.

మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ నిఖిల్ పోస్ట్ వేశారు.ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెబుతూ ఆ ఫోటోలను తెగ వైరల్ చేశారు.

కాగా తాజాగా నిఖిల్ డైపర్ డ్యూటీ అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు.

నిఖిల్ భార్య పల్లవి అండ్ ఫ్రెండ్స్.పుట్టబోయే బేబీకి డైపర్స్ ఎలా వెయ్యాలో అనేది నిఖిల్ కి నేర్పించే క్లాస్ తీసుకున్నారు.

"""/" / ఈ క్రమంలోనే ఒక జిరాఫీ బొమ్మకి డైపర్ వేయడం ప్రాక్టీస్ చేయించారు.

ఇక వారి చెప్పినట్లు నిఖిల్ ఆ బొమ్మకి డైపర్ వేసి టెస్ట్ పాస్ అయ్యారు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియోని నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు.

ఆ వీడియో పై అభిమానులు ఫన్నీగా స్పందిస్తున్నారు.పుట్టబోయే బిడ్డ కోసం డైపర్ ను మార్చే పనిని ఇప్పటి నుంచే నేర్చుకుంటున్న నిఖిల్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను వీడియోలను వైరల్ చేస్తున్నారు.

షాకింగ్ వీడియో: పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు.. విద్యార్థిని నుజ్జునుజ్జు!