ఈ దేశంలో ఏం సమస్యలు లేవా.. రణ్‌వీర్ సింగ్ ఫోటోలపైనే చర్చలు.. స్వాతి మలివాల్?

గత కొంతకాలం నుంచి బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.

ఈయన వ్యవహార శైలి వల్ల ఏకంగా పెద్దపెద్ద సినీ ప్రముఖులు అలాగే మహిళా సంఘాల నేతలు ఈ విషయంపై స్పందిస్తూ ఏకంగా డిబేట్ లు కూడా నిర్వహిస్తున్నారు.

ఈ విధంగా రణవీర్ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కడానికి గల కారణం ఆయన న్యూడ్ ఫోటోలను చెప్పాలి.

ఒంటి పై ఒక్క నూలు పోగు కూడా లేకుండా ఈయన ఒక మ్యాగజైన్ కోసం నగ్న ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలపై పెద్ద ఎత్తున మహిళా సంఘాల నేతలు మండిపడుతూ తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా కొందరు ఈయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం ఈయనకు మద్దతు తెలుపుతున్నారు.

ఇప్పటికే ఈ విషయం గురించి బాలీవుడ్ నటి అలియా భట్ స్పందిస్తూ ఆయన న్యూడ్ ఫోటోలకు మద్దతుగా నిలబడినట్లు వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా తాజాగా రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోల పై ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) ఛైర్ పర్సన్ స్పందించింది.

"""/" / ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎంతోమంది మహిళల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అయితే మహిళలకు సంబంధించిన ఇలాంటి నగ్న ఫోటోలు పై ఎవరూ స్పందించరు కేవలం ఈయన ఫోటోలపై మాత్రమే స్పందించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారని డీసీడబ్ల్యూ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ తెలిపింది.

 ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మహిళల నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టిన ఎవరికి ఏమి పట్టదు కానీ ఒక నటుడు ఫోటోలకు ఇలా ఫోజులిస్తే మాత్రం ప్రైమ్ టైమ్ డిబేట్స్‌లో టాపిక్‌గా మారాడు.

దేశంలో నిజమైన సమస్యలు మరేమీ లేవా.? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

ఇలా అయితే ఎలా అఖిల్.. తెలుగు వారియర్స్ రెండో ఓటమి