గుండెలు పిండేసే మాట చెప్పిన స్వాతినాయుడు భర్త అవినాష్... ఇలాగే జీవితాంతం ఉండాలి మీరు
TeluguStop.com
యూట్యూబ్ సంచలన తార స్వాతి నాయుడు ఇటీవలే విజయవాడలో అవినాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.
వివాహం అత్యంత వైభవంగా జరిగింది.అయితే వీరి వివాహంకు అవినాష్ తరపున కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఎవరు కూడా హాజరు కాలేదు.
స్వాతి నాయుడును పెళ్లి చేసుకోవడం అవినాష్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అందుకే అతడిని ఇంటి నుండి వెలివేసినట్లుగా ప్రకటించారు.
ఈ సమయంలోనే అవినాష్ కుటుంబ సభ్యుల నుండి అతడు చట్టపరమైన చిక్కులను కూడా ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ గుండెలు పిండేసేలా వ్యాఖ్యలు చేశాడు.స్వాతి నాకు ఒక మంచి స్నేహితురాలు.
ఆమె వ్యక్తిత్వం చాలా మంచింది.ఆమె గురించి నేను ఎప్పుడు కూడా పాజిటివ్‌గానే ఆలోచించాను.
ఆమె వీడియోలకు కారణం ఏంటో నాకు తెలుసు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కెమెరా ముందు స్వాతి కంటే అసభ్యంగా కనిపించిన వారు, స్వాతిలా చేసిన వారు ఎంతో మంది ఉన్నారు.
వారు సినిమాలో అవి చేయడం వల్ల వారిపై విమర్శలు చేయరు.కాని స్వాతి యూట్యూబ్‌లో చేయడం వల్ల అందరి విమర్శలు ఎదుర్కొంది.
స్వాతి అలా చేయడం కేవలం కెమెరా వరకే పరిమితం.ఆ విషయం నాకు తెలుసు.
మా కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని ఒప్పుకోలేక పోయారు.అందుకే వారు పెళ్లికి ఒప్పుకోలేదు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
స్వాతి ఎలాంటిదో నాకు తెలుసు, ఆమె మనసు మంచిది అందుకే కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను.
కొత్త జీవితం తప్పకుండా అందరి అండదండలతో సాఫీగా సాగుతుందని కోరుకుంటున్నాను.స్వాతిని ఎప్పుడు గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తాను అంటూ అవినాష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్వాతిని అభిమానించే కొందరు మీ జీవితం అంతా సాఫీగా సాగాలని, ఇద్దరు కూడా జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలని పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కుటుంబ సభ్యులు మీకు అండగా ఉండకున్నా ఇద్దరు కూడా సంతోషకర జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం అంటూ పెద్ద ఎత్తున స్వాతి మరియు అవినాష్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
2028 సంవత్సరం నాటికి పుష్ప3 రిలీజ్ కావడం సాధ్యమేనా.. ఈ సినిమా ముందున్న సమస్యలివే!