స్వాతికి సినిమా ఛాన్స్ లు వస్తాయా..?

కలర్స్ షోతో పాపులర్ అయ్యి ఆ తర్వాత హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంది కలర్స్ స్వాతి.

( Colours Swathi ) హీరోయిన్ గా కొన్నాళ్లు అలరించిన అమ్మడు తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటించింది.

కెరీర్ ముగిసింది అనుకున్న టైం లో అమ్మడు పైలెట్ ని పెళ్లాడి ఫారిన్ లో సెటిల్ అయ్యింది.

చేసిన కొన్ని సినిమాల్లో అయినా కూడా ఆడియన్స్ ని అలరించిన స్వాతి చాలా గ్యాప్ తర్వాత రీసెంట్ గా లైఫ్ ఆఫ్ సత్య అనే స్పెషల్ వీడియో సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

"""/" / సాయి ధరం తేజ్( Sai Dharam Tej ) స్వాతి జంటగా స్పూర్తిదాయకంగా ఈ వీడియో సాంగ్( Video Song ) ఉంది.

లైఫ్ ఆఫ్ సత్య చూసిన ప్రతి ఒక్కరు స్వాతిని సూపర్ అనేస్తున్నారు.స్వాతి ఇప్పటికీ అలానే ఉందని ఆమె తప్పకుండా హీరోయిన్ గా నటించొచ్చని అంటున్నారు.

స్వాతి కూడా సత్య వీడియోకి వచ్చిన రెస్పాన్స్ చూసి అవకాశం వస్తే మళ్లీ సినిమాలు చేయాలని చూస్తుంది.

కలర్స్ స్వాతి మళ్లీ తిరిగి ఫాం లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి.

స్వాతి సినిమాలు చేస్తే ఆమెను ఆదరించేందుకు ఆడియన్స్ రెడీగా ఉన్నారని తెలుస్తుంది.

అలా జరిగితే బన్నీ నంబర్ వన్ హీరో అవుతారా.. అసలేం జరిగిందంటే?