మార్చి నెలలో రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి.. ఏడు నెలలు కాకుండానే బిడ్డకు జన్మనివ్వడంతో?

ప్రముఖ బాలీవుడ్ నటి స్వర భాస్కర్( Bollywood Actress Swara Bhaskar ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

జూన్ నెలలో గర్భం దాల్చినట్లు ప్రకటించిన స్వర భాస్కర్ అదిరిపోయే తీపికబురు చెప్పారు.

తాజాగా స్వర భాస్కర్ సీమంతం వేడుక గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే.

సమాజ్ వాదీ పార్టీ నేత, స్వర భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

"""/" / తమకు ఈ నెల 23వ తేదీన కూతురు పుట్టిందని ఆయన అన్నారు.

తమ కూతురుకు రుబియా( Rubia ) అనే పేరును ఫిక్స్ చేశామని తెలిపారు.

ఈ ఏడాది మార్చి నెలలో స్వరభాస్కర్, ఫహద్( Fahad Ahmed ) పెళ్లి జరగగా పెళ్లైన ఏడు నెలలకే స్వర భాస్కర్ బిడ్డకు జన్మనివ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొదట ఒక నిరసన కార్యక్రమంలో స్వర భాస్కర్ ఫహద్ అహ్మద్ తొలిసారి కలుసుకోవడం జరిగింది.

ఫిబ్రవరి నెల 16వ తేదీన సోషల్ మీడియా వేదికగా పెళ్లికి సంబంధించి స్వర భాస్కర్ ఫహద్ అహ్మద్ ప్రకటన చేశారు.

మార్చిలో సాంప్రదాయ పద్ధతిలో స్వర భాస్కర్ ఫహద్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు.అయితే గర్భవతి అయిన తర్వాతే స్వర భాస్కర్ పెళ్లి చేసుకున్నారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

"""/" / గర్భం దాల్చడం వల్లే రహస్యంగా పెళ్లి చేసుకుని ప్రెగ్నెన్సీ( Pregnancy ) వచ్చినట్లు ప్రకటించారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిన్నారికి జన్మనిచ్చిన స్వర భాస్కర్ కు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

స్వర భాస్కర్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.స్వర భాస్కర్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతుండగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ అంచనాలను మించి పెరుగుతుండటం గమనార్హం.

భారత సంతతి సీఈవో‌లతో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ భేటీ.. !!