పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం.. షూటింగ్ లో సత్తా చాటిన స్వప్నిల్!

పారిస్ ఒలింపిక్స్ లో( Paris Olympics ) భారత్ సత్తా చాటుతోంది.భారత్ ఖాతాలో తాజాగా మరో పతకం చేరింది.

యువ షూటర్ స్వప్నిల్( Shooter Swapnil ) మెన్స్ 3 పొజిషన్ షూటింగ్ ఫైనల్ లో మూడో స్థానంలో నిలిచారు.

స్వప్నిల్ సత్తా చాటి కాంస్య పతకాన్ని( Bronze Medal ) సొంతం చేసుకున్నారు.

మొదట నెమ్మదిగా మొదలుపెట్టిన స్వప్నిల్ కీలక సమయంలో సత్తా చాటారు.ఒకానొక సమయంలో స్వప్నిల్ 4, 5 స్థానాలలో సైతం కొనసాగారు.

టాప్3 లోకి వచ్చిన తర్వాత స్వప్నిల్ మాత్రం వెనక్కి తిరిగి చూడలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

451.4 పాయింట్లు సాధించి స్వప్నిల్ ప్రశంసలు అందుకున్నారు.

చైనాకు చెందిన లి యుకున్ స్వర్ణం కైవసం చేసుకోగా ఉక్రెయిన్ షూటర్ కులిష్ సెర్హియ్ రజతం కైవసం చేసుకున్నారు.

మూడు పొజిషన్లలో ఈ పోటీలు జరగగా ప్రోన్, నీలింగ్, స్టాండింగ్ షూటింగ్ చేయాల్సి ఉంటుంది.

"""/" / స్వప్నిల్ మోకాళ్లపై షూటింగ్ లో 153.5 పాయింట్లు సాధించగా ప్రోన్ విభాగంలో 156.

8 పాయింట్లు, స్టాండింగ్ లో 141.1 పాయింట్లను సాధించారు.

స్వప్నిల్ సక్సెస్ స్టోరీ( Swapnil Success Story ) ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

స్వప్నిల్ ప్రతిభను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.స్వప్నిల్ ఎంతోమంది యువ క్రీడాకారులకు స్పూర్తిగా నిలుస్తున్నారు.

"""/" / భారత్ ఖాతాలో మూడో పతకం చేరడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.స్వప్నిల్ పూర్తి పేరు స్వప్నిల్ కుశాలే కాగా మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.

స్వప్నిల్ వయస్సు 28 సంవత్సరాలు కాగా రైతు కుటుంబంలో జన్మించిన స్వప్నిల్ ఒక్కో మెట్టు ఎదిగి ఈ స్థాయికి చేరుకుని వార్తల్లో నిలిచారు.

షూటింగ్ పై మక్కువతో కఠిన సవాళ్లకు ఎదురీది మరీ స్వప్నిల్ సక్సెస్ సాధించారు.

61 నేషనల్ ఛాంపియన్ షిప్ లో స్వప్నిల్ స్వర్ణ పతకం గెలిచారు.స్వప్నిల్ మరిన్ని విజయాలను సాధించాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?