అమెరికాలో నిందితుడి వింత కోరిక..షాక్ అయిన పోలీసులు...!!!

అగ్ర రాజ్యం అమెరికాలో ప్రతీ రోజు ఎదోఒక చోట డ్రగ్స్ మాఫీయా కేసులు నమోదవుతూనే ఉంటాయి.

ఈ కేసులు నమోదయిన వారిలొ అధికశాతం మంది యువకులు ఉంటడం, అందులోనూ విద్యార్ధులు ఉంటడం సర్వ సాధారణం అవుతోంది.

అలా డ్రగ్స్ కేసుల్లో దొరికిన వారు తమ ముఖాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా జాగ్రత్తలు పడుతూ మీడియా ముందు కనపడుతారు.

కానీ అమెరికాలో తాజాగా డ్రగ్స్ కేసులో జరిగిన అరెస్ట్ లో ఓ యువకుడు మాత్రం కొంచం డిఫరెంట్ గా ప్రవర్తించాడు.

పట్టుబడిన వెంటనే అందరిలా ముఖానికి ముసుగు తొడుక్కుంటాడు అనుకుంటే అతడు ఏకంగా మీతో ఓ ఫోటో దిగాచ్చా అంటూ రిక్వెస్ట్ చేశాడట.

దాంతో షాక్ అయ్యి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్న పోలీసులు సరే అంటూ నేరగాడితో కలిసి ఫొటోలకి ఫోజులు ఇచ్చారు.

ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2020/01/Swapard-albama-Selfy-with-officers-in-lessee-spring-నిందితుడి-వింత-కోరిక!--jpg"/స్వపార్డ్ అనే 24 ఏళ్ళ కుర్రాడు డ్రగ్స్ సరఫరా చేయడంలో దిట్ట.

అలబామాలో లేసీ స్ప్రింగ్ ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకి చిక్కాడు.అతడిని పట్టుకున్న పోలీసులు కారులో ఎక్కిస్తున్న సమయంలో అతడు నాకు ఓ చిన్న కోరిక ఉంది, మీతో కలిసి నేను ఫోటో దిగాలని ఉందని అడిగాడు.

అతడు అడిగిన కోరికని కాదనలేని పోలీసులు సరే అంటూ నవ్వుతూ ఫొటోలకి పోజులు ఇచ్చారు.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోటో వైరల్ అవుతోంది.పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశ పెడుతూ ఉండటం సహజమే.

ఇదే సమయంలో కెమెరాలకు తమ ముఖం కనిపించకుండా నిందితులు దాక్కుంటూ ఉండటం కూడా సహజమే.

అయితే అమెరికాలో ఓ నిందితుడు మాత్రం అరెస్ట్ అయిన వెంటనే పోలీసులతో తనంతట తానే ఓ ఫొటో దిగాడు.

వివరంగా చెప్పాలంటే.హీథ్ స్వఫార్డ్(24) అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తూ అలబామాలోని లేసీ స్ప్రింగ్స్ ప్రాంతంలో పోలీసులకు చిక్కాడు.

హీథ్‌ను పట్టుకుని పోలీసులు కారులో ఎక్కిస్తుండగా.హీథ్ వారిని ఓ చిన్న కోరిక కోరాడు.

పోలీసులతో కలిసి హ్యాండ్‌కఫ్స్‌లో ఓ ఫొటో దిగాలని అడిగాడు.హీథ్ అడిగిన కోరికకు పోలీసులు షాకైనప్పటికీ.

అతడి కోరికను తీర్చారు.హీథ్‌తో పాటు నవ్వుతూ పోలీసులు సైతం ఫొటోకు స్టిల్ ఇచ్చారు.

నెటిజన్లు ఈ వార్తపై సోషల్ మీడియాలో వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

జీరా వాట‌ర్ బ‌రువు త‌గ్గ‌డానికి మాత్రమే కాదు.. ఆ స‌మ‌స్య‌ల‌కు కూడా చెక్ పెడుతుంది తెలుసా?