గ్రామంలో స్వచ్ఛభారత్ గ్రామ సభ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఇల్లంతకుంట మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ తూముకుంట శ్రీలత నరేందర్ రెడ్డి అధ్యక్షతన స్వచ్ఛభారత్ గ్రామ సభ( Swachh Bharat Grama Sabha ) నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వీధులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వాడిన నీటిని ఇంకుడు గుంతలోకి వెళ్లే విధంగా చూడాలని, అదేవిధంగా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి గ్రామపంచాయతీ ట్రాక్టర్ కు అందజేసి కంపోస్ట్ షెడ్ కు తరలించాలని సూచించారు.

ప్లాస్టిక్( Plastic ) ను వాడకుండా బట్ట సంచులను ఉపయోగించుకోవాలని తెలియజేశారు.అదేవిధంగా గ్రామాన్ని ఓడిఎఫ్ ప్లస్( ODF Plus Village ) గ్రామంగా డిక్లేర్ చేసుకుందామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లయ్య వార్డు సభ్యులు నారాయణ రాజలింగం పద్మ, కో ఆప్షన్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి , వెంకటవ్వ, పంచాయతీ కార్యదర్శి మధు, సి ఏ రజిత, ఫీల్డ్ అసిస్టెంట్ రమ, అంగన్వాడి టీచర్ వర్ష ,ఆశ వర్కర్ అరుణ, మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసిన మాధవీలత.. ఆమెకు న్యాయం జరుగుతుందా?