భర్త, కొడుకు, కోడలు చనిపోయాక ఎస్వీ రంగారావు భార్య ఎన్ని కష్టాలు పడిందో తెలుసా ?
TeluguStop.com
ఎస్వీ రంగారావు( SV Ranga Ra ) జీవితం గురించి, ఆయన సినిమాల గురించి అలాగే వ్యసనాల గురించి అనేక ఆర్టికల్స్ లో ఇప్పటికే తెలుసుకున్నాం.
ఆయన చనిపోయిన విధానం కూడా మనకు తెలిసిందే.అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఆయన జీవిత భాగస్వామి లీలావతి భర్తను కోల్పోయిన తర్వాత కొడుకు కోడల్ని కూడా కోల్పోయి ఒంటరిగా మనవడిని పెంచుతూ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనే విషయం బయట ప్రపంచానికి తెలియదు.
ఎస్వి రంగారావు 1947 లో లీలావతి నీ వివాహం చేసుకున్నారు.వీరికి ముగ్గురు సంతానం కాగా అందులో ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
రంగారావు బతికున్నన్ని రోజులు బాగానే సంపాదించారు.పెద్ద ఆర్టిస్టులకు కన్నా కూడా నాలుగు రేట్లు ఎక్కువగా రెమ్యునరేషన్( Remuneration ) తీసుకొని బాగానే కూడాపెట్టారు.
అయితే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి.1974 జూలై 18న ఆయన గుండెపోటుతో మరణించిన తర్వాత అసలు కష్టాలు మొదలయ్యాయి ఆయన కుటుంబానికి.
"""/" /
ఎస్సీ రంగారావు బతికున్నప్పుడే కొడుకుకి మాత్రమే పెళ్లి చేశారు.ఆయన కన్నుమూసాకే వారి జీవితం కష్టాలను ఎదుర్కోవడం మొదలుపెట్టింది.
ఆయన వారసులు ఎవరు నటనలోకి రాలేదు అలాగే ఎలాంటి ఉద్యోగం సద్యోగం చేయలేదు.
రంగారావు తోనే సంపాదన ఆగిపోయింది.ఇక 1988లో ఎస్వీ రంగారావు కోడలు ఒక ప్రమాదంలో కన్ను మూసింది.
ఆ తర్వాత సరిగా ఏడాదికి ఎస్వీ రంగారావు చనిపోయిన అదే డేట్ నా 18 జూలై 1989లో రంగారావు కొడుకు కూడా కన్నుమూశారు.
తండ్రి చనిపోయిన అదే డేట్ లో అదేవిధంగా గుండెపోటుతో కన్నుమూశారు.భర్త చనిపోయిన దుఃఖాన్ని దిగమింగుకొని జీవితాన్ని వెల్లదీస్తున్న లీలావతికి కొడుకు కోడలు కూడా మరణించడంతో తీవ్ర క్షోభకు గురైంది.
"""/" /
అయినా కూడా వారికి కలిగిన ఏకైక సంతానాన్ని ఆమె పెంచింది, ఎస్సీ రంగారావు చనిపోయిన 26 ఏళ్లకు లీలావతి( Leelavathi )కూడా కన్ను మూసింది అప్పటి వరకు మనవడిని పెంచింది.
అలాగే ఇద్దరు కూతుర్ల పెళ్లి కూడా చేసింది.ఆస్తులన్నీ కూడా కరిగిపోయాయి.
అంత పోయినా కొంత మిగిలింది.కానీ ప్రస్తుతం ఎస్వీ రంగారావు మనవడికే నా అన్న వాళ్ళు లేరు.
బంధువుల సహాయంతో జీవితంలో బాగానే సెటిల్ అయ్యాడు ప్రస్తుతం.కానీ లీలావతి మాత్రం అతడి పెంచడానికి ఇబ్బందులు పడింది.
కోట్లలో ఉండే ఆస్తులు అన్నీ కూడా మెల్లిమెల్లిగా కరిగిపోతూ వచ్చాయి.అందరి పెళ్లిళ్లు చేసి అందరిని సెటిల్ చేశాక 2000 సంవత్సరంలో లీలావతి కన్నుమూసింది.
ఒక్కరోజు జైలు జీవితం బన్నీని భయపెట్టిందా.. ఇకపై ఆ తప్పు అస్సలు చెయ్యరా?