ఇక సినిమాలు మానేసి సీరియల్స్ చేస్తే మంచిది రెడ్డి గారు !

పాత తరం దర్శకులకి ఇది గడ్డు కాలమే.ఎందుకంటే కొత్త నీరు వచ్చినప్పుడు పాత తరం పక్కకు జరిగి వెళ్లాల్సిందే.

ఇంకా ఏదో చేయాలనే తహతగా ఉంటే చాలా కష్టం.ఈ తరం వారు అస్సలు పట్టించుకోరు అందుకు సరిగ్గా ఉదాహరణగా సరిపోతుంది ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు.

జనాల మీదికి వదిలిన ఈ పాత చింతకాయ పచ్చడి సినిమా విషయాన్ని ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

పైగా సోహెల్ కి కూడా చాలా రోజులుగా బ్రేక్ దొరకడం లేదు ఈ సినిమాతో అయినా గట్టిగా అనుకుంటే అది కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

"""/" / మొత్తానికి ఎస్పీ కృష్ణారెడ్డి తీసుకున్న సబ్జెక్టు మీద నిర్మాతకు కూడా నమ్మకం లేనట్టుగా ఉంది అందుకే సినిమాపై పెద్దగా ఖర్చు పెట్టలేదు ఒక రాజేంద్రప్రసాద్ కి మినహా మిగతా వారికి ఈ రెమ్యూనరేషన్ విషయంలో పెద్దగా ఇచ్చినట్టుగా కనిపించడం లేదు.

ప్రసాద్ విగ్గుల కర్చే ఈ సినిమాకి హైలెట్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు.ఒక పేదింటి అబ్బాయి పెద్దింటి అమ్మాయితో లవ్ లో పడటం అనే కాన్సెప్ట్ వెనకటి కాలంలో నడిచింది.

కానీ ఇప్పుడు సీరియల్స్ లో కూడా కనిపించడం లేదు జనాలు చాలా అప్డేట్ అయిపోయారు.

అప్డేటెడ్ గా సినిమా తీస్తేనే చూస్తారు ఈ సినిమా కోసం అయితే థియేటర్ కి జనాలు వెళ్లడం జరిగే పని కాదు.

"""/" / ఇక ఇలాంటి సినిమా తీస్తే జనాలు చూడడం కష్టం కానీ ఏదైనా సీరియల్ డైరెక్షన్ చేస్తే బెటర్.

లేదంటే చాలామంది చేస్తున్నట్టు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ఏ కథ చెప్పినా నడుస్తుంది.

ఇక నిర్మాత గట్టెక్కాలి అంటే శాటిలైట్, ఓటిటి లాంటివి ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేదంటే థియేటర్ ను నమ్ముకొని సినిమా విడుదల చేస్తే ఇలాంటి సినిమాలు నిండా ముంచేస్తాయి తప్ప లాభం ఉండదు.

ఇది సూపర్ కి కూడా అసలు వర్కౌట్ కాకపోగా ఆ హీరోయిన్ ఎవరో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

మీనాకి కూడా ప్రాధాన్యత లేదు.కామెడీ ట్రాకులు పండలేదు అందులో పంచులు కూడా లేవు.

జనాల ఓపికకు పరీక్ష పెట్టే సీన్లు కూడా ఉన్నాయి.

షార్ట్స్ వేసుకున్న కూతురికి ఫాదర్ ఫన్నీ లెసన్.. వీడియో చూస్తే నవ్వాగదు..!