Rajendra Prasad SV Krishna Reddy : రాజేంద్ర ప్రసాద్ అలక గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి.. ఆ రైట్స్ రాయించుకున్నారంటూ?

అప్పట్లో మాయలోడు( Mayalodu ) అనే సినిమాలో చినుకు చినుకు అనే సాంగ్ సూపర్ హిట్ గా నిలచిన విషయం తెలిసిందే.

బాబు మోహన్ సౌందర్య ఈ పాటలకు స్టెప్పులు ఇరగదీశారు.ఆ తర్వాత ఇదే పాటను ఆలీ సౌందర్యలతో కలిసి శుభలగ్నం సినిమాలో( Subhalagnam ) వాడుకున్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.

అయితే ముందుగా మాయ‌లోడులో ఆ పాట‌ను బాబూమోహ‌న్- సౌంద‌ర్య‌ల జంట‌గా చిత్రీక‌రించ‌డంపై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు ఉన్నాయి.

ఆ సినిమాలో హీరోని కాద‌ని అందులో క‌మేడియ‌న్ తో హీరోయిన్ తో పాట‌ను చిత్రీక‌రించ‌డం పై ర‌క‌ర‌కాల పుకార్లు వినిపించాయి.

దీనిపై ద‌ర్శ‌కుడు ఎస్వీకే ఎప్పుడూ పెద్ద‌గా స్పందించ‌లేదు కానీ, ఇన్నేళ్ల‌కు ఆయ‌న బ‌య‌ట‌ప‌డ్డారు.

"""/" / గతంలో ఈ విషయం గురించి ఆయనకు చాలా సార్లు అనేక ప్రశ్నలు ఎదురవగా ఎప్పుడు స్పందించని ఆయన తాజాగా ఈ విషయంపై స్పందించారు.

ఈ మేరకు ఆయన స్పందిస్తూ.మాయ‌లోడు హీరో రాజేంద్ర‌ప్ర‌సాద్( Rajendra Prasad ) స‌హాయ‌ నిరాక‌ర‌ణ వ‌ల్లే ఆ పాట‌ను నేను బాబూ మోహ‌న్ తో( Babu Mohan ) చిత్రీక‌రించాను అంటూ ఎస్వీకే కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు.

సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతున్న ద‌శ‌లో రాజేంద్ర ప్ర‌సాద్ నాకు పూర్తి స‌హాయ నిరాక‌ర‌ణ చేశారు.

అస‌లు సినిమా ఎలా పూర్త‌వుతుందో చూస్తా అనేంత స్థాయికి ఆయ‌న వెళ్లారరు అని ఎస్ వి కృష్ణారెడ్డి( SV Krishna Reddy ) చెప్పుకొచ్చారు.

నువ్వూ డ్యాన్సులు చేస్తావ‌ట క‌దా.నువ్వూ స్టెప్పులు వేస్తావ‌ట క‌దా.

అంటూ నాపై కూడా రాజేంద్ర‌ప్ర‌సాద్ వెట‌కారం ఆడారు. """/" / దీంతో నేను తీవ్రంగా హ‌ర్ట్ అయ్యాను.

త‌మ‌కు మిగిలిన డేట్స్ త‌క్కువ కావ‌డంతో.పాట చిత్రీక‌ర‌ణ‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్ ను బ‌తిమాలుకున్న‌ట్టుగా ఎస్వీకే తెలిపారు.

ఎంతగా బ్రతిమలాడినప్పటికీ రాజేంద్రప్రసాద్ వారికి సహకరించలేదని ఇండస్ట్రీ పెద్దలను రంగంలోకి దించినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు ఎస్వి కృష్ణారెడ్డి.

చివ‌ర‌కు రాజేంద్ర ప్ర‌సాద్ తో మిగిలిన డేట్స్ తో ముందుగా డ‌బ్బింగ్ పూర్తి చేయించిన‌ట్టుగా, ఆ డ‌బ్బింగ్ చెప్ప‌డానికి కూడా ఆయ‌న ష‌ర‌తు పెట్టార‌ని, మాయ‌లోడు త‌మిళ డ‌బ్బింగ్ రైట్స్ ను( Mayalodu Tamil Dubbing Rights ) రాయించుకుని ఒక్క రోజు డ‌బ్బింగ్ చెప్ప‌డానికి ముందుకొచ్చారన్నారు.

రైట్స్ రాయించిన ప‌త్రాల‌ను రాజేంద్ర‌ప్రసాద్ మేనేజర్ చూసిన త‌ర్వాతే డ‌బ్బింగ్ థియేట‌ర్లోకి ఆయ‌న ఎంట‌ర‌య్యార‌ని, """/" / ఒక రోజులో ఎలాగూ డ‌బ్బింగ్ పూర్తి కాకుండా ఆగిపోతుంద‌ని ఆయ‌న అనుకున్నార‌ని, అయితే ఆయన సీన్ల‌ను వ‌ర‌స‌గా ప్ర‌ద‌ర్శించేసి మ‌ధ్యాహ్నానికి డ‌బ్బింగ్ పూర్తి చేసి ఆయ‌నకు న‌మ‌స్కారం పెట్టేసిన‌ట్టుగా ఎస్వీకే అన్నారు.

పాట మిగిలి ఉంద‌నే ద‌ర్పంతో రాజేంద్ర‌ప్రసాద్ నిష్క్ర‌మించ‌గా.ఆయ‌న‌ను ఇక బ‌తిమాలాల్సిన అవ‌స‌రం లేద‌ని, అప్ప‌టికే బాబూమోహ‌న్ త‌న మ‌న‌సులో ఉండ‌టంతో ఆయ‌నతో పాట‌ను చిత్రీక‌రించిన‌ట్టుగా ఎస్వీకే అన్నారు.

త‌ను బాబూమోహ‌న్ తో పాట‌ను తీస్తున్నాన‌నే విష‌యాన్ని తెలిసి.మ‌ధ్య‌వ‌ర్తులు రంగంలోకి దిగార‌ని, అయితే ఇక త‌న‌కు అవ‌స‌రం లేద‌ని, త‌ను బాబూమోహ‌న్ కు మాట ఇచ్చేసిన‌ట్టుగా ఇక మార్చ‌లేన‌ని త‌ను నిష్క‌ర్ష‌గా చెప్పి, కావాలాంటే రాజేంద్ర‌ప్ర‌సాద్ రావొచ్చ‌ని, షూటింగ్ చూసి వెళ్లొచ్చ‌ని త‌ను చెప్పిన‌ట్టుగా ఎస్వీకే వివ‌రించారు.

దిల్ రాజు బ్యానర్ లో చరణ్ మరో సినిమా.. ఆ మూవీతో నష్టాలు తీరనున్నాయా?