వివాహిత మహిళ‌ అనుమానాస్పద మృతి…!

నల్గొండ జిల్లా:కట్టంగూరు మండలం పరడ గ్రామానికి చెందిన బుర్రి స్వాతి (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది,పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మహేశ్ తో స్వాతికి ప్రేమపెళ్లి జరిగింది.

గత కొంత కాలంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని,ఈ మధ్య కాలంలోనే ఇద్దరు విడివిడిగా వుండుకుంటూ గ్రామ పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నరని, ఇద్దరికి రెండు సంవత్సరాల పాప ఉన్నట్లు తెలిపారు.

అమ్మగారింట్లో ఉంటున్న స్వాతి గురువారం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని,స్థానికుల సమాచారంతో తమ బృందంతో ఘటన స్థలానికి చేరుకున్నామని కట్టంగూర్ ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.

ఆత్మహత్య గల కారణాలు త్వరలో వెల్లడిస్తామని కేసు దర్యాప్తు నిమిత్తం విచారణ చేపడుతున్నామని తెలిపారు.

కల్కి పార్ట్ 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన నిర్మాత…అప్పుడే షూటింగ్ పూర్తి అంటూ?