ఏపీ అసెంబ్లీలో ఇద్దరు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.నిరసనల నేపథ్యంలో వాయిదా పడిన అసెంబ్లీ విరామం అనంతరం మళ్లీ తిరిగి ప్రారంభం అయింది.

టీడీపీ వాయిదా తీర్మానంను స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు.ఆస్తులకు నష్టం చేస్తే వారి నుంచే వసూలు చేస్తామన్నారు.

ఈ క్రమంలోనే ఇద్దరు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.అనగాని సత్యప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని వెల్లడించారు.

అదేవిధంగా టీడీపీ సభ్యులు అగౌరవపరిచేలా ప్రవర్తించారన్న స్పీకర్ తమ్మినేని సభలో మీసాలు తిప్పడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు సూచించారు.

సభా సంప్రదాయాలు ఉల్లంఘించడం సరికాదని హెచ్చరించారు.

జనవరి నెల బాక్సాఫీస్ రివ్యూ ఇదే.. మొత్తం సినిమాల్లో ఎన్ని సినిమాలు హిట్ అంటే?