ఐఏఎస్ అధికారి గిరిషాపై సస్పెన్షన్ వేటు..!

ఏపీలో నకిలీ ఓటర్లు, నకిలీ ఎపిక్ కార్డుల వ్యవహారంలో ఈసీ చర్యలకు సిద్ధమైంది.

ఈ మేరకు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో నకిలీ ఓటర్లు, ఎపిక్ కార్డుల వ్యవహారంలో అప్పటి తిరుపతి ఆర్వో, ఏఆర్వో, బీఎల్ఓలపై ఈసీ చర్యలకు ఆదేశించింది.

సుమారు ముప్ఫై వేలకు పైగా నకిలీ ఓట్లు, ఓటర్ కార్డులు జారీ అయినట్లు ఈసీ గుర్తించింది.

ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారి గిరిషాపై సస్పెన్షన్ వేటు వేసింది.కాగా గిరిషా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్నారు.

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల సమయంలో గిరిషా రిటర్నింగ్ అధికారిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు బర్త్ డే కూడా పోయింది…రాజమౌళి అప్డేట్ ఇచ్చేది అప్పుడేనా..?