గద్వాల్ అదనపు ఎస్పీ రాములు నాయక్‎పై సస్పెన్షన్ వేటు

మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.ఈ క్రమంలో మరో అధికారిపై వేటు పడింది.

ఉప ఎన్నికల భద్రతా విధుల్లో పాలుపంచుకున్న గద్వాల్ అదనపు ఎస్పీ రాములు నాయక్ పై వేటు వేసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు రాములు నాయక్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

మునుగోడు ఉప ఎన్నికల భద్రతా విధుల్లో ఉన్న రాములు నాయక్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసినట్లుగా ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది.

దర్యాప్తులో భాగంగా రాజగోపాల్ రెడ్డిని రాములు నాయక్ కలిసినట్లుగా రుజువైంది.దీంతో రాములు నాయక్ ను సస్పెండ్ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

రాములు నాయక్ ను తప్పించిన రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాఫీలో వీటిని కలిపి తీసుకోండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి!