విశాఖ మాడుగుల టీడీపీ సీటుపై ఉత్కంఠ
TeluguStop.com
విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గ టీడీపీ ( TDP )సీటుపై ఉత్కంఠ నెలకొంది.
మాడుగుల సీటును ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్( NRI Paila Prasad ) కు పార్టీ అధిష్టానం కేటాయించింది.
అయితే నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు అనివార్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ క్రమంలోనే పార్టీ కీలక నేత బండారు సత్యనారాయణ మూర్తి( Bandaru Satyanarayana Murthy ) అభ్యర్థిత్వంపై హైకమాండ్ సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ మాడుగుల నియోజకవర్గం నుంచి పోటీపై బండారు సత్యనారాయణ మూర్తి సముఖంగా లేరని సమాచారం.
మరోవైపు టీడీపీ అధిష్టానం వైఖరితో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు( Former MLA Gavireddy Ramanaidu ) సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలో అభ్యర్థి పైలా ప్రసాద్ కు వ్యతిరేకంగా రామానాయుడు వర్గీయులు భారీగా ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో నియోజకవర్గ అభ్యర్థి మార్పు ఉంటుందా లేదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కీళ్ల నొప్పులు ఉన్నవారు కంద తింటే ఏం అవుతుందో తెలుసా?