బిగ్‌బాస్‌ 3 గురించి అక్కినేని సన్నిహితుల వింత వాదన, ఫ్యాన్స్‌ టెన్షన్‌

తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ 3 కి కూడా కమల్‌ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు.ఇటీవలే బిగ్‌బాస్‌ 3 తమిళం అధికారిక ప్రకటన వచ్చింది.

కమల్‌ హోస్ట్‌ అంటూ క్లారిటీ ఇచ్చేశారు.ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది అంటూ మా వారు అఫిషియల్‌గా ప్రకటించాడు.

అందుకోసం ఒక వీడియోను కూడా విడుదల చేశారు.వీడియో అయితే విడుదల చేశారు.

కాని హోస్ట్‌ ఎవరు అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. """/"/ ఈ నెల చివర్లో హోస్ట్‌పై క్లారిటీ వస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మా వారు ఇప్పటికే హోస్ట్‌ను ఫైనల్‌ చేసి ఉంటారని, హోస్ట్‌ ఫైనల్‌ కాకుండా అఫిషియల్‌ అనౌన్స్‌ మెంట్‌ వచ్చే అవకాశం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలోనే అక్కినేని నాగార్జున సీజన్‌ 3 కి హోస్టింగ్‌ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.

ఈ సమయంలోనే అక్కినేని వారి నుండి సమాచారం అందుతున్న మేరకు నాగార్జున బిగ్‌బాస్‌ కు హోస్ట్‌గా చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని వారు అంటున్నారు.

"""/"/ వారి ప్రకటనతో మళ్లీ కథ మొదటికి వచ్చినట్లయ్యింది.గత కొన్ని రోజులుగా హోస్ట్‌ నాగార్జున కన్ఫర్మ్‌ అనుకుంటున్న సమయంలో అక్కినేని ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే వారు ఇలా అనడం ఏంటీ అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరి నాగార్జున కాకుంటే మరెవ్వరు అనే చర్చ మొదలైంది.కొందరు మాత్రం నాగార్జున బిగ్‌బాస్‌ సీజన్‌ 3 హోస్ట్‌ అన్నట్లుగా నమ్మకంతో ఉన్నారు.

ప్రస్తుతం నాగ్‌ తప్ప మరెవ్వరు కూడా కనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.