గుండెపోటుకు గురైన సుస్మితాసేన్… ఆపరేషన్ జరిగిందంటూ వెల్లడించిన నటి!

మాజీ విశ్వసుందరి సుస్మితసేన్ గత కొద్ది రోజుల క్రితం తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారని తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

గుండెపోటుకు గురైన సమయంలో తనకు ఆంజియో ప్లాస్టీ జరిగిందని, లోపల స్టంట్ కూడా వేశారని తెలిపింది.

ఇలా ఈమె గుండెపోటుకు గురయ్యానంటూ చేసినటువంటి ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది చూసినటువంటి అభిమానులు ఒకసారిగా ఆందోళన వ్యక్తం చేశారు.అయితే తాను తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

"""/" / ప్రస్తుతం తన ఆరోగ్యం చాలా బాగుందని సుస్మితసేన్ ఈ పోస్ట్ ద్వారా తెలియజేయడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

గుండెను ఆనందంగా, సంతోషంగా, ధైర్యంగా ఉంచుకోండి.అలా ఉంటే.

ఆ గుండె మీకు ఆపత్కాల సమయంలో అండగా ఉంటుందనీ మా తండ్రి ఎప్పుడూ చెప్పేవారు.

ఈ క్రమంలోనే తాను గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారని విషయాన్ని కూడా ఈమె తెలియజేశారు.

ఇక నాకు సర్జరీ చేసినటువంటి డాక్టర్ మీ హృదయం చాలా పెద్దదని కూడా చెప్పారు.

నేను ఎంతో మందికి కృతజ్ఞతలు చెప్పాలి ఆ విషయాలన్నీ మరొక పోస్ట్ ద్వారా తెలియజేస్తానని ఈమె తెలియజేశారు.

"""/" / ఇక ఈ పోస్ట్ ద్వారా మీకు శుభవార్త చెప్పాలని చేశానంటూ ఈమె ప్రస్తుతం ఎంతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వరుస ప్రాజెక్టులతో తన జీవితంలో బిజీ కానున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.

అయితే ఒకానొక సమయంలో ఈమెకు ఎలాంటి అవకాశాలు లేక ఎంతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

అలాంటి కష్ట కాలంలో తనకు ఆర్య అనే వెబ్.సిరీస్ లో నటించే అవకాశం వచ్చిందని అయితే అది మంచి హిట్ కావడంతో తనకు అవకాశాలు వస్తున్నాయని ఈ సందర్భంగా సుస్మితా సేన్ తన ఆరోగ్యం గురించి తన కెరియర్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక పరుగులు పెట్టిద్దాం .. ఏపీపై బిజెపి ఫోకస్