Susmitha Sen : ఆ రోజు గుక్క పెట్టి ఏడ్చాను : సుష్మితా సేన్

కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అవి చాలా చిన్న విషయాలుగా ఉంటాయి.కొన్నేళ్ల తర్వాత వాటిని వెనక్కి తిరిగి చూసుకుంటే అవి అద్భుతాలుగా కనిపిస్తాయి.

అలాంటి ఒక అద్భుతమే ప్రపంచ సుందరి హీరోయిన్ సుష్మితా సేన్ ( Susmitha Sen )జీవితంలో కూడా జరిగింది.

సుష్మితా సేన్ 30 ఏళ్ల క్రితం అంటే 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని ( Miss Universe Crown )గెలుచుకుంది.

ఈ పోటీ లో ప్రపంచంలోని పలు దేశాల అందగత్తెలు పోటీ పడగా ఫిలిప్పీన్స్ లో జరిగిన ఈ పోటీలో సుష్మితా సేన్ విశ్వ విజేతగా గెలిచి భారత దేశాన్ని సగౌరవంగా తలెత్తుకునేలా చేసింది.

ఇప్పటికి ఈ ఈవెంట్ జరిగి ఆమె విజేతగా గెలిచి 30 ఏళ్ల సమయం గడిచిన అనేక ఇంటర్వ్యూలో అప్పటి సంగతులను నెమరు వేసుకుంటూనే ఉంటుంది సుష్మితా.

"""/" / తాజాగా ఆమె ఇంటర్వ్యూ లో మిస్ యూనివర్స్ పోటీల్లో ( Miss Universe Crown )బోరున విలపించిన సందర్భాన్ని గుర్తుచేసుకొని మరోసారి ఎమోషనల్ గా మారిపోయింది.

అసలు విషయంలోకి వెళితే విశ్వ విజేతను ఎంపిక చేసే చివరి రౌండ్ లో స్టేజ్ పైకి వెళ్లాల్సిన సమయం కి ముందు ఆమె తన ఇయర్ రింగ్స్ ని మిస్ చేసుకుందట.

తన డ్రెస్ అప్పీరెన్స్ కి ఇయర్ రింగ్స్ లేకపోతే ఈజీగా తనలో లోపం కనిపిస్తుందని తాను గెలిచే అవకాశాన్ని కోల్పోతానని భావించి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని విలపిస్తూనే ఉందట.

అదే టైంలో అక్కడికి ఫిలిప్పీన్స్ దేశం నుంచి పాల్గొన్న మోడల్ ఆమె దగ్గరికి వచ్చి ఇలా చెప్పిందట.

" హలో మిస్ ఇండియా కోసం ఏమైనా చేయాలా నేను నీకేమైనా కావాలా నువ్వు మా దేశంలో ఈ పోటీలో పాల్గొంటున్నావు నీకోసం ఏదైనా చేస్తాను కన్నీళ్లు పెట్టడం ఆపేసి ఏం కావాలో చెప్పు" అని అడిగిందట.

"""/" / అప్పుడు తాను ఇయర్ రింగ్స్( Ear Rings ) ని మిస్ చేసుకున్న విషయం చెప్పగా ఆ మాడల్ తన రూమ్ కి వెళ్లి తన దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం చూపించిందట.

అవి చూసి తను ఫినాలేకి ఏది వేసుకుంటుందో అడిగి అది తప్ప మిగతా వాటిల్లో ఏదో ఒకటి తీసుకుంటానని చెప్పగా నా దేశంలో నాకు అన్ని దొరుకుతాయి.

మీకు ఏది కావాలంటే అది తీసుకోమని చెప్పిందట.అక్కడ ఒక జత కమ్మలని తీసుకొని ఫినాలేకి వెళ్లిందట.

దాంతో ఆమె మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది.ఈవెంట్ అయిపోయిన తర్వాత సదరు మాడల్ రూమ్ కి వెళ్లి తన ఇయర్ రింగ్స్ ని రిటర్న్ చేయాలనుకుంటే ఆమె నవ్వుతూ నువ్వు జోక్ చేస్తున్నావా నువ్వు విశ్వవిజేతగా గెలిచావు.

విజేత దగ్గర నుంచి నేను అవి మళ్ళీ వెనక్కి తీసుకోగలుగుతానా ఇవి నా గిఫ్ట్ గా ఉంచుకో అని చెప్పిందట.

ఆ సందర్భాన్ని తలుచుకుని పలుసార్లు సుష్మితా సేన్ ఎమోషన్ అవుతూ ఉంటుంది.అంతే కాదు ఫినాలేకి వేసుకున్న డ్రెస్ కర్టన్ క్లాత్స్ నుంచి రెడీ చేయించుకుందని, గ్లౌసెస్ సాక్స్ క్లాత్ నుంచి రెడీ చేయించుకున్నానని చెప్పి తన టేస్ట్ తన భిన్నమైన అభిరుచి ని సుష్మితా సేన్ ఇంటర్వ్యూలలో చెబుతూ వస్తున్నారు.

/p.

వీడియో: ఆకాశంలో ఆశ్చర్యపరిచే దృశ్యం.. మేఘాల్లో నడుస్తున్న మనిషి..??