Sushmita Sen : మొదటి సారి ట్రోలింగ్స్ పై స్పందించిన సుస్మితా సేన్.. నా గురించి అనవసరం అంటూ?
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ నటి మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్( Sushmia Sen ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఇటీవల సుష్మిత సేన్ పేరు సోషల్ మీడియాలో తెగ మారుమోగుతున్న విషయం తెలిసిందే.
సుస్మిత సేన్ ఐపీఎల్ మాజీ చైర్మన్ అయిన లిఖిత్ మోడితో ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న విషయం తెలిసిందే.
అంతే కాకుండా ఈమె పాక్ క్రికెటర్ వసీమ్ అక్రమ్, తనకంటే వయసులో చిన్నవాడైన రోహ్ మన్, మరికొందరితో డేటింగ్ చేసినట్టు బాలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపించాయి.
ఇక రీసెంట్ గా వ్యాపారవేత్త లలిత్ మోడీతో డేటింగ్ ప్రకటించారు. """/"/
అయితే ఆ విషయాన్నీ ప్రకటించిన మూడు నెలలకే సుస్మితా సేన్ లలిత్ మోడీ( Lalit Modi )కి బ్రేకప్ చెప్పినట్టు తెలుస్తోంది.
పెళ్లి దాకా వెళ్లిన వీరి ప్రేమ ఎందుకు విఫలమైందో తెలియదు.ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయారని అంటున్నారు.
కాగా సుష్మితా సేన్, లలిత్ మోడీ రిలేషన్ షిప్ ప్రకటించిన కొత్తలో సుష్మితాపై కొందరు దారుణంగా ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే.
గోల్డ్ డిగ్గర్( Gold Digger ) అంటూ ఆమెను దారుణంగా విమర్శించారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఆ ట్రోల్స్ పై సుశ్మితా సేన్ స్పందించారు.
తాను నటించిన తాళి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూకి హాజరైన సుస్మితా ఈ విషయం గురించి స్పందిస్తూ.
"""/"/
ఇది నా జీవితం.నా గురించి బయట వ్యక్తులకు అనవసరమని నేను భావిస్తున్నాను.
గోల్డ్ డిగ్గర్ అంటే అర్థం తెలుసుకోగలను.ఇలా విమర్శలు వస్తే చాలా బాధగా ఉంటుంది.
కానీ అలాంటివి నేను పట్టించుకొను.ప్రస్తుతం నేను ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేను సింగిల్ గానే ఉన్నాను అని చెప్పుకొచ్చింది సుస్మితా సేన్.
ఇటీవలె ఆమె నటించిన తాళి సినిమా( Taali Movie )లోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఆ ఫస్ట్ లుక్ పై స్పందిస్తూ.సోషల్ యాక్టివిస్ట్, ట్రాన్స్ జెండర్ శ్రీగౌరి సావంత్ జీవితం ఆధారంగా తాళి సినిమా తెరకెక్కుతోంది.
ఈ మూవీ ఫస్ట్ లుక్ పై కొందరు నెటిజన్స్ దారుణంగా కామెంట్స్( Comments ) చేశారు.
అసలు ఇలా కూడా కామెంట్స్ చేయగలరా అని ఆశ్చర్యపోయాను.ఏదేమైనా అందరికీ బదులివ్వాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చింది సుస్మితా సేన్.