మళ్లీ ప్రేమలో పడిన సుస్మితా సేన్.. ఆమె ప్రియుడు ఎవరో తెలిస్తే షాక్ అవాల్సిందే!

బాలీవుడ్ హీరోయిన్ సుష్మితా సేన్ గురించి మనందరికీ తెలిసిందే.ఈమె తన అందంతో విశ్వసుందరిగా పేరు సంపాదించుకుంది.

కేవలం హిందీలోనే కాకుండా తమిళ, తెలుగు సినిమాలలో కూడా నటించి నదిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

కాగా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే నటి సుష్మితా సేన్‌ తాజాగా మరోసారి ప్రేమలో పడింది.

మాజీ ఐపీఎల్‌ చైర్మన్‌ లలిత్‌ మోదీతో డేటింగ్‌ చేస్తోంది.అయితే ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు లలిత్‌ మోదీ.

సుష్మితను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు.

వారిద్దరు కలిసి మాల్దీవుల్లో షికార్లు కొట్టాక లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాను.

నా జీవిత భాగస్వామి సుష్మిత సేన్‌తో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని రాసుకొచ్చాడు లలిత్‌ మోదీ.

అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అనుకున్న నెటిజన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.

కాసేపటికే లలిత్‌ మోదీ తమ పెళ్లి గురించి క్లారిటీ ఇస్త ప్రస్తుతానికి తామింకా డేటింగ్‌లోనే ఉన్నామని, ఒక్కరోజులోనే ఒకరితో ఒకరం ప్రేమలో పడిపోయా అని చెప్పుకొచ్చాడు.

"""/"/ అయితే సుష్మితా సేన్‌ మొదట్లో పాక్‌ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌తో ప్రేమాయణం నడిపి సహజీవనం కూడా చేసారు.

కానీ క్షణం తీరికలేని సుష్మితా షెడ్యూల్‌ వల్ల వసీమ్‌ తీవ్రమైన అభద్రతకు లోనయ్యాడట అలా ఆ తరువాత కోపాలు, ద్వేశాలతో పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేక్‌ అయింది.

ఆ తర్వాత సుష్మితా సేన్‌ ప్రముఖ మోడల్‌ రోహ్‌మన్‌తో ప్రేమలో పడింది.కానీ అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.

వీడియో: పనిమనిషి సోఫాలో కూర్చుందంటూ ఎన్నారై మహిళ ఫిర్యాదు.. ఆమెపై నెటిజన్లు ఫైర్!