Sushmita Sen: వాళ్లకు తండ్రి అక్కర్లేదట! ఇప్పుడు పెళ్ళెందుకు అంటున్నారు.. సుస్మితా సేన్ కామెంట్స్ వైరల్?
TeluguStop.com
బాలీవుడ్ నటి మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్( Sushmita Sen ) గురించి మనందరికీ తెలిసిందే.
ఇటీవల కాలంలో సుష్మితా సేన్ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఈమె ఎక్కువగా తన లవ్ స్టోరీ ల విషయంలోనే బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె పేరు సోషల్ మీడియా( Social Media )లో మారుమోగిపోతోంది.
ఆ వివరాల్లోకి వెళితే.సుష్మితా సేన్ 24 ఏళ్ల వయసున్నప్పుడు అంటే 2010వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది.
2010లో అలీషాను దత్తత తీసుకుంది.వీరిద్దరినీ కన్నబిడ్డల్లా కంటికి రెప్పలా చూసుకుంటోంది.
"""/" /
తండ్రి లేడు అన్న లోటు వారికి తెలియకుండా పెంచుతోంది.అయితే తాజాగా ఇదే విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.
నా పిల్లలు నాన్న లేడు అని ఎప్పుడు ఫీలవలేదు.ఎందుకంటే మన దగ్గర ఉన్నది కోల్పోతేనే మిస్ అవుతాం.
లేనిదాని గురించి మిస్ అయిన భావనే రాదు.ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కూడా ఇప్పుడెందుకు పెళ్లి? అసలు దేనికోసం? మాకైతే నాన్న అవసరం లేదు అనేస్తారు.
నేను భర్తను కోరుకుంటున్నానేమో అని కూడా అనుకోరు.మాములుగా పెళ్లి గురించి మేము చాలా జోక్స్ చేసుకుంటాము.
వాళ్లకు తండ్రి లేడు అనే లోటు కూడా తెలియదు. """/" /
ఎందుకంటే వారికి తాత ఉన్నాడు.
మా నాన్నే వారి తాతయ్య ఆయనే వారికి అన్నీ అయి ఆడిస్తాడు అని చెప్పుకొచ్చింది సుష్మితా సేన్.
ఈ సందర్భంగా సుష్మితా సేన్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే మొన్నటి వరకు కూడా ఐపీఎల్ మాజీ చైర్మన్ అయిన లిఖిత్ మోదీ( Likhit Modi ) తో ప్రేమలో మునిగి తేలుతోంది డేటింగ్ చేస్తోంది అంటూ జోరుగా వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఒకటి రెండు ప్లాప్ లు వచ్చిన రామ్ చరణ్ కి ఇబ్బంది లేదా..?