అలాంటి సమస్యతో బాధపడుతున్న సుస్మిత కొణిదెల… అసలేమైందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టారు ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి చిరంజీవి అనంతరం తన కుటుంబ సభ్యులందరికీ కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వచ్చారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది మెగా వారసులు హీరోలుగా కొనసాగుతూ ఉన్నారు.మెగా కుటుంబం నుంచి హీరోయిన్గా నిహారిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

అయితే ఈమెనూ హీరోయిన్గా మెగా అభిమానులు యాక్సెప్ట్ చేయలేక తనను ఇండస్ట్రీలో సక్సెస్ కానివ్వలేదు.

ఇలా కెరియర్ మొదట్లోనే హారిక యాంకర్ గా ప్రయత్నాలు చేశారు.అనంతరం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ఇక హీరోయిన్గా కూడా సక్సెస్ కాకపోవడంతో నిర్మాతగా మారి పలు సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల( Sushmitha Konidela ) కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

తన తండ్రి తన తమ్ముడు చరణ్ సినిమాలకు ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.

ఒకవైపు డిజైనర్ గా కొనసాగుతూనే మరోవైపు గోల్డెన్ బాక్స్ నిర్మాణ సంస్థలు( Golden Box Construction Companies ) కూడా స్థాపించిన సంగతి తెలిసిందే.

"""/" / ఇప్పటికే పలు సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడం కోసం ఈమె ఎంతో కష్టపడుతున్నారు.

ఇక తన నిర్మాణ సంస్థలో తన తండ్రితో కలిసి సినిమా చేయాలన్నదే తన కోరిక అంటూ ఈమె తెలియజేశారు.

సుస్మిత నిర్మాణంలో చిరంజీవి హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా కూడా రాబోతుంది అంటూ ఇదివరకే ప్రకటించారు అయితే ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం కానుంది.

ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సుస్మిత తన తండ్రికి కాస్ట్యూమ్ డిజైన్ చేయడం గురించి పలు విషయాలను వెల్లడించారు.

సినిమా కథ చెప్పగానే ఆ సినిమాలో నాన్న పాత్రకు సంబంధించి ఎలాంటి డ్రెస్సులు డిజైన్ చేయాలి అనే విషయం గురించి తాను చాలా కంగారు పడతానని ప్రతి ఒక్కరికి నచ్చేలాగా ఆ డిజైన్స్ ఉండాలి కదా అందుకే ఆ విషయంలో తాను చాలా టెన్షన్ పడుతూనే ఉంటానని సుస్మిత తెలిపారు.

"""/" / ఇలా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో విషయాలను ముచ్చటించినటువంటి ఈమె తన గురించి ఒక విషయాన్ని కూడా బయటపెట్టారు తనలో ఒక వీక్నెస్ ఉందని తాను ఆ సమస్యతో సతమతమవుతున్నానని తెలియజేశారు మరి ఈమె బాధపడుతున్నటువంటి ఆ సమస్య ఏంటి అనే విషయానికి వస్తే .

ఓవర్ థింకింగ్ (Over Thinking)తాను ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించాను అంటే పదేపదే అదే విషయం గురించి ఆలోచనలో ఉంటానని తెలిపారు.

దాదాపు సగం రోజు మొత్తం ఆ విషయం గురించి ఆలోచించడానికి సమయం కేటాయిస్తానని ఇది తనలో ఉన్నటువంటి పెద్ద సమస్య అని దీనిని మార్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్న కూడా మార్చుకోలేకపోతున్నాను అంటూ సుస్మిత తెలిపారు.

ఈమె ఓవర్ థింకింగ్ చేస్తుందనే విషయం బయటపడటంతో ఇది కొన్నిసార్లు మంచిదే కానీ ప్రతి విషయం పట్ల ఇలా అతిగా ఆలోచిస్తే పెద్ద ప్రమాదాలు జరుగుతాయని ముందు ఈ సమస్య నుంచి బయటపడటం ఎంతో ఉత్తమం అంటూ కూడా పలువురు కామెంట్లు చేస్తున్నారు.

వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి షాకింగ్ పోస్ట్ పెట్టిన విదేశీ మహిళ..??