అక్కినేని కాంపౌండ్‌లో మరో హీరోకు గాయాలు

ఇటీవల అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్ర షూటింగ్‌లో గాయపడ్డాడని, అతడికి డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించడంతో చిత్ర షూటింగ్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఈ వార్త ఇంకా అందరికీ తెలియకముందే, మరో అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో గాయాలపాలయ్యాడు.

యంగ్ హీరో సుశాంత్ ఇటీవల అల వైకుంఠపురములో చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా సక్సెస్‌తో తన నెక్ట్స్ మూవీని ఇటీవల స్టార్ట్ చేశాడు ఈ హీరో.

‘నో పార్కింగ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు సుశాంత్.

అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో అతడికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.దీంతో ఈ సినిమా షూటింగ్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాతో ఎస్.దర్శన్ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు.

హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి అనే అమ్మాయి కూడా ఈ సినిమాతో పరిచయం అవుతుంది.

మరి ఈ సినిమాతోనైనా సుశాంత్ హీరోగా సక్సెస్ కొడతాడో లేదో చూడాలి.

తెలుగు వారిగా పుట్టి తప్పు చేశామా అని అనిపించే నటీనటులు వీరే !