60 ఫిట్ల రోడ్ పై నజర్ పెట్టిన పట్టణ ట్రాఫిక్ పోలీసులు

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని 60ఫిట్ల రోడ్ పై నిత్యం హారాన్ మోతలతో రాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టణ ప్రజలను ఇబ్బందులకు చేస్తున్న వారిపై గురువారం పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రాష్ డ్రైవింగ్,త్రిబుల్ డ్రైవింగ్ చేస్తున్న పలువురు యువకుల వాహనాలను పట్టుకొని విచారించి,యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

సరైన పత్రాలు,లైసెన్స్ లేకుండా నడిపే వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడుతూ ఇక ప్రతిరోజు 60 ఫీట్ల రోడ్లో డ్రైవ్ కొనసాగించడంతో పాటు యువకులకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తగిన జాగ్రత్త వహించాలని, మైనర్ల ఎట్టిపరిస్థితుల్లో వాహనాలు ఇవ్వవద్దని, ఏదైనా జరగరానిది జరిగితే దానికి తల్లిదండ్రులే పూర్తి బాధ్యులవుతారని,మద్యం సేవించి నడిపినా,సైలెన్సర్ లేని వాహనాలు నడిపినా, త్రిబుల్ డ్రైవింగ్,రాష్ డ్రైవింగ్ కు పాల్పడినా, పెద్ద పెద్ద శబ్దాలతో హరన్లు కొట్టినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రముఖ విద్యా సంస్థలకు వేదికగా ఉన్న 60 ఫీట్ల రోడ్డులో నిత్యం వేలాది మంది విద్యార్థులు వస్తూ పోతూ ఉంటున్నందున పట్టణ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టడంతో కొంత ఉపశమనంగా మారిందని, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇలాగే చేస్తే యువకుల్లో భయం ఏర్పడి కొంతమేర ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు,వాహనదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ధనుంజయ్ రెడ్డి ని వదిలేలా లేరే ?