చిన్న కుటుంబం నుండి చికాగో నగరానికి…!

సూర్యాపేట జిల్లా: ఓ మారుమూల పల్లెటూరిలో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి,ఖండాంతరాలు దాటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్శిటి నుండి మాష్టర్ ఆఫ్ సైన్స్ లో పట్టా పొందిన విద్యార్ధిని పయనం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా,( Suryapet District ) మునగాల మండలం,రేపాల గ్రామానికి చెందిన సోమపంగు చిన్నమైసయ్య,రమణ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు,ఒక అబ్బాయి.

ఇంటర్ వరకు చదువుకున్న మైసయ్య గ్రామంలో చిన్న చిన్న వ్యవసాయ మోటార్లు రిపేర్ చేస్తూ జీవనం సాగించేవాడు.

గత 25 ఏళ్ల క్రితం పిల్లల చదువుల కోసం పొట్ట చేతపట్టుకొని హైదారాబాద్ నగరానికి బ్రతుకు తెరువు నిమిత్తం వలస వెళ్ళాడు.

అక్కడ చిన్న చిన్న ఎలక్ట్రీషియన్ వర్క్స్ చేసుకుంటూ పిల్లలను చదివించాడు.ఆర్ధిక పరిస్థితి బాగోలేక పెద్ద కుమార్తెకు వివాహం చేసి,మిగతా ముగ్గురు పిల్లలను కష్టపడి ఉన్నత చదువులు చదించాడు.

తల్లిదండ్రులు తమ కోసం పడుతున్న కష్టాన్ని చూసిన ఇద్దరు అమ్మాయిలు ఎలాగైనా ఉన్నత చదువులు చదివి వారికి పేరు తేవాలని భావించారు.

హైదారాబాద్ లో డిగ్రీ పూర్తి చేసిన రెండవ కుమార్తె సోమపంగు మౌనిక( Somapangu Mounika ) ఉన్నత చదువుల కోసం అమెరికా( America ) వెళ్ళాలని తన మనసులోని మాటను పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లడంలో బిడ్డ కోరికను నెరవేర్చేందుకు అప్పులు చేసి మరీ గత రెండేళ్ల క్రితం అమెరికా పంపించారు.

చికాగో( Chicago ) నగరంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్శిటి నుండి మాష్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసిన మౌనిక శుక్రవారం యూనివర్శిటి నుండి పట్టా అందుకొని తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టింది.

"""/" / ఇదిలా ఉంటే రెండవ కూతురు ఉన్నత చదువుల కోసం ఏడాది కృతం లండన్ పంపించారు.

ఆమె ప్రస్తుతం లండన్ లో విద్యనభ్యనిస్తుంది.ఇక కుమారుడు హైదారాబాద్ లో డిగ్రీ పూర్తి చేసి,ప్రైవేట్ జాబ్ చేస్తూ పేరెంట్స్ కు చేదోడువాదుడుగా ఉంటూ అక్కల చదువుకు తన వంతు కృషి చేస్తున్నాడు.

చిన్న కుంటుంబంలో పుట్టి చికాగో నగరంలో ఉన్నత చదువు పూర్తి చేసిన మౌనిక తల్లిదండ్రులకు,పుట్టిన గడ్డకు, జిల్లాకు పేరు తేవడం హర్షణీయమని,ఆమెను ప్రోత్సహించి విదేశాలకు పంపిన తల్లిదండ్రులు పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని"చదువుకోడవం కష్టం కాదు.

చదువంటే మనకు ఇష్టం ఉంటే"అని నిరుపేద కుటుంబంలో జన్మించిన మౌనిక నిరూపించి చూపించిందని రేపాల గ్రామానికి చెందిన పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.

ప్రతి ఒక్కరూ వీరి కుటుంబాన్ని,మౌనికను ఆదర్శంగా తీసుకుని ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుతూ హాట్సాఫ్ టు మౌనిక సోమపంగు అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అంటున్నారు.

యూఎస్: కోర్ట్‌రూమ్‌లో నేరస్థుడు ఎలాంటి రిక్వెస్ట్ చేశాడో తెలిస్తే…