ఏంటి ? ఇక్కడ ఉన్నది సూర్యనా? గుర్తుపట్టారా?

సూర్య.ఎంత అద్భుతమైన నటుడో చెప్పాల్సిన పని లేదు.

ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాల క్యారెక్టర్స్ చేసి.తన సినిమా అంటే మాములు సినిమా కాదు.

ఒక ప్రత్యేకత ఉంటుందని నిరూపించుకున్న వ్యక్తే సూర్య.మంచి చదువు చదివి సినిమా అవకాశం వచ్చిందని సినిమాల్లోకి వచ్చిన సూర్య వ్యక్తిత్వం పరంగాను హీరోనే.

రీల్ లోను రియల్ లోను సూర్య హీరో అవ్వడం వల్లే హీరోయిన్ జ్యోతిక సూర్యని ప్రేమించి పెళ్లి చేసుకుందని ఇప్పటికి సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తుంటాయ్.

నిజమెంతో తెలియదు కానీ మంచి సెలబ్రెటీ కపుల్స్ లో వీరు ఒకరు.ఇక ఇద్దరు కూడా సినిమాల్లో మంచి నటులు.

అద్భుతంగా నటిస్తూ స్టార్స్ గా ఎదిగారు.ఇక సూర్య విషయానికి వస్తే.

సినిమాకు తగ్గట్టు ఆయన రూపం మారుస్తుంటారు.ఏ సినిమాలో ఎలా కనిపించాలి అంటే అలా.

పాత్ర అద్భుతంగా ఉండేందుకు ఎంతైనా కష్టపడుతుంటారు సూర్య.ఇక ఇప్పుడు అలానే ఒక సినిమాలో తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

ఇక అందుకే అచ్చం సూర్య లానే కనిపించేలా తన రూపాన్ని మొత్తం మార్చుకున్నాడు సూర్య.

టక్కున చూస్తే గుర్తుపట్టలేం కానీ కొంచం గమనిస్తే మాత్రం ఏంటి ఇక్కడ ఉన్నదీ సూర్యనా అని ఆశ్చర్యపోతారు.

తమిళుల సాహసక్రీడ జల్లికట్టు నేపథ్యంలో నిర్మాణం అవుతున్న చిత్రం వాడివాసల్‌.ఈ సినిమాలో సూర్య గ్రామీణ జల్లికట్టు క్రీడాకారుడిగా తన గెటప్‌ను మార్చుకున్నారు.

గడ్డం, పొడవైన మీసాలు, జుట్టు అంత డిఫరెంట్ గా ఉండటంతో ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది! ఏంటండీ? ఈ ఫొటోలో ఉన్నది సూర్యనా? అని షాక్ అవుతున్నారు.

ఏది ఏమైనా డిఫరెంట్ గా కనిపించడంలో సూర్యకు మించి ఎవరు లేరు! మరి మీరు ఏం అంటారు? .

అనిల్ రావిపూడిని కొట్టిన వాళ్లకు భారీ ఆఫర్ ఇచ్చిన జక్కన్న.. షాక్ లో డైరెక్టర్!