సూర్య ఒక 100 కోట్ల సినిమా మిస్‌ చేసుకున్నాడా?

తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా సూరారై పోట్రూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్‌ వచ్చింది.

తెలుగులో ఆకాశమే నీ హద్దురా టైటిల్‌ తో డబ్‌ అయ్యింది.తెలుగు మరియు తమిళంలో సూపర్‌ హిట్‌ టాక్‌ను దక్కించుకున్న ఈ సినిమా థియేటర్లలో అయితే మరింతగా ఆకట్టుకునేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు దర్శకురాలు సుధ కొంగర తెరకెక్కించిన ఈ సినిమా నిజంగా చాలా విభిన్నంగా అద్బుతంగా ఉందని.

ఇంతటి ప్రతిభావంతురాలికి ఇన్నాళ్లు బ్రేక్ రాకపోవడం ఏంటీ అంటూ ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సోషల్‌ మీడియా టాక్‌ చూస్తుంటే సినిమా థియేటర్లలో విడుదల అయ్యి ఉంటే ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ సూర్య చాలా కాలంగా మంచి సినిమా లేక కెరీర్‌ పరంగా డల్‌ అయ్యాడు.

థియేటర్లలో ఈయన సినిమా సక్సెస్‌ కొట్టి చాలా కాలం అయ్యింది.కాని ఈసారి మాత్రం థియేటర్లలో ఈయన వస్తే ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ అయ్యేవాడు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

థియేటర్లకు ఇప్పటికే కేంద్రం నుండి పర్మీషన్‌ వచ్చింది.ఇలాంటి సమయంలో సినిమాను ఓటీటీలో విడుదల చేయడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సూర్య ఇంత మంచి సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీలో ఎలా విడుదల చేస్తాడు అంటూ సినీ వర్గాల వారు సైతం ప్రశ్నిస్తున్నారు.

ఓటీటీలో సౌత్‌ నుండి విడుదలైన పలు సినిమాలు బొక్క బోర్లా పడ్డాయి.మొదటి సారి మంచి విజయం అందుకున్న సినిమాగా ఇది నిలిచింది.

ఈ సినిమా సూపర్‌ హిట్‌ తో మరికొన్ని సినిమాలు కూడా ఓటీటీ రిలీజ్‌ చేయాలంటే వెనుకంజ వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!