సూర్య కంగువ మూవీ ట్రైలర్ రివ్యూ.. స్టార్ హీరో సూర్య నట విశ్వరూపం చూపించారుగా!
TeluguStop.com
స్టార్ హీరో సూర్య ( Surya )నటించి మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదలవుతున్న కంగువ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
అక్టోబర్ నెల 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా రిలీజ్ కు రెండు నెలల ముందే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.
కంగువ ట్రైలర్( Kanguva Trailer) ను చూసిన ప్రేక్షకులు సూర్య పర్ఫామెన్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కామెంట్లు చేస్తున్నారు.
స్టార్ హీరో సూర్య నట విశ్వరూపం చూపించారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రైలర్ లో విజువల్స్ అద్భుతంగా ఉండగా అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ ఉంది.
ఈ సినిమాకు శివ డైరెక్టర్ కాగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే శివ( Shiva )కు క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. """/" /
దేవిశ్రీ ప్రసాద్( Devi Sri Prasad ) ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా ఈ సినిమాలో దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు.
బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.కంగువ సక్సెస్ సాధిస్తే సూర్య మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఈ సినిమా కోసం సూర్య మార్కెట్ ను మించి ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.
"""/" /
కంగువ సినిమా ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.
దసరా పండుగ కానుకగా రిలీజ్ కానుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.
కంగువ సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.
ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
ఎంతమంది చేరినా తెలంగాణ లో టీడీపీకి కష్టమేనా ?